Begin typing your search above and press return to search.

గ‌త రికార్డును తిర‌గ‌రాయ‌ని తిరుప‌తి.. పార్టీల్లో వ‌ణుకు

By:  Tupaki Desk   |   17 April 2021 5:30 PM GMT
గ‌త రికార్డును తిర‌గ‌రాయ‌ని తిరుప‌తి.. పార్టీల్లో వ‌ణుకు
X
తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో అవాంత‌రాల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు మాత్రం ఇంటి గ‌డప దాట‌డం లేదు. కార‌ణాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు ప్ర‌జ‌లు ముందుకు రాని ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. దీంతో అన్ని పార్టీల్లోనూ క‌ల‌క‌లం రేగుతోంది. నిజానికి ఓటు శాతం పెరిగితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప్ర‌భావం ఎక్కువై.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని స‌హ‌జంగానే పార్టీలు భావిస్తాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ, బీజేపీలు జోరుగా ప్ర‌చారం చేశాయి. ముఖ్యంగా ఈ విష‌యంలో టీడీపీ మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించింది. ఏకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగారు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున ఏడుగురు మంత్రులు రంగంలోకి దిగారు. దాదాపు 13 రోజుల పాటు ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో భారీ ఎత్తున ఓటింగ్ జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఎన్నిక‌ల పోలింగ్ విష‌యానికి వ‌స్తే.. అన్ని పార్టీల అంచ‌నాలూ త‌ల్ల‌కిందులు అయ్యాయ‌నే చెప్పాలి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో తిరుపతి పార్ల‌మెంటు స్థానంలో 79.19 శాతం పోలింగ్ జ‌రిగింది. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ఈ పోలింగ్ న‌మోదైంది. దీనిలో వైసీపీకి 55%, టీడీపీకి 38% ఓట్లు పోలయ్యాయి. కానీ, ఇప్పుడు ఈ రేంజ్‌లో పోలింగ్ జ‌ర‌గ‌లేదు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌శాంతంగానే పోలింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఎనిమిది-9గంట‌ల వ‌ర‌కు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒక‌టి రెండు ఓట్ల క‌న్నా ఎక్కువ ప‌డ‌లేదు.

పోనీ.. ఒక్క తిరుపతిలోనే ఇలా ఉందా? అంటే.. కాదు.. తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌చ్చే ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోలింగ్ మంద‌కొడిగానే సాగింది. వాస్త‌వానికి తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో మొత్తం 17 ల‌క్ష‌ల పైచిలుకు ఓట‌ర్లు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 14.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రిగితే.. ఈ ద‌ఫా మాత్రం 10 ల‌క్ష‌లు కూడా దాటేలా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 79.19 శాతం పోలింగ్ జ‌రిగితే.. ఈ ద‌ఫా సాయంత్ర ఐదు గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 55శాతం వ‌ర‌కు మాత్ర‌మే పోలింగ్ జ‌రిగింది. సో.. ఎలా చూసుకున్నా.. పార్టీల అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి..
అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పోలైన ఓట్లు ప‌ర్సంటేజ్‌
స‌ర్వేప‌ల్లి 136092 57.91
గూడూరు 128629 51.82
సూళ్లూరు పేట 144629 60.11
వెంక‌ట‌గిరి 137558 55.88
తిరుప‌తి 129454 45.85
శ్రీకాళ‌హ‌స్తి 141110 51
స‌త్య‌వేడు 123156 58.45
-----------------------------------------------------------------------------------
మొత్తం 940678 54.99
-------------------------------------------------------------------------