Begin typing your search above and press return to search.
తిరుపతి బై పోల్ : చివరి పంచ్ సీఎం జగన్ దే !
By: Tupaki Desk | 7 April 2021 3:30 PM GMTఏపీలో తిరుపతి బై పోల్ కాకరేపుతుంది. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చివరి పంచ్ ఇవ్వనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఈ నెల 14న ఆయన తిరుపతి వెళ్లనున్నారు. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రెండు రోజులు ముందుగా 15న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రచారం సమాప్తం కావడానికి ఒకరోజు ముందు సీఎం జగన్ ప్రచార పర్యటన ఖరారు కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే .. మరోవైపు టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. రోజుకో నియోజకవర్గంలో రెండు మూడు సభలు నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. అయితే, అసలు ట్విస్ట్ ఏమిటంటే... చంద్రబాబునాయుడు ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తుంటే,సీఎం జగన్ మాత్రం ఒకే రోజు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్ రాలేదు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే , ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు. అయితే తిరుపతి గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీడీపీ , సత్తా చాటాలని బీజేపీ , జనసేన చూస్తున్న ఈ తరుణం లో జగన్ తన పర్యటన తో వారి ఆశలకు గండి కొట్టినట్టే. తిరుపతిలో భారీ మెజార్టీ సాధించాలనే పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రచారానికి వెళుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారనే సమాచారం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. దీనితో వైసీపీ శ్రేణులు ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు.