Begin typing your search above and press return to search.
తిరుపతి బైపోల్ పై హైకోర్టులో నేడు విచారణ
By: Tupaki Desk | 27 April 2021 6:30 AM GMTతిరుపతి లోక్ సభ నియోజకవర్గం లో తాజాగా ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఉప ఎన్నిక ఫలితం మే 2 న వెలువడనుంది. అయితే , తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేయాలని, ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా నిలువరించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. ఇదే వ్యవహారంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా పిటిషన్ దాఖలు చేశారని సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టు దృష్టికి తీసుకురాగా , ఆ పిటిషన్ ను కూడా బీజేపీ పిటిషన్ తో జత చేయాల్సిందిగా రిజిస్ట్రీని కోరాలని న్యాయమూర్తి సూచించారు.
తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో రీపోలింగ్ నిర్విహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17, 19న కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతులను తిరిగి పరిగణనలోకి తీసుకుని, విచారణ జరిపి కోర్టుకు నివేదిక అందజేసేలా ఆదేశాలివ్వాలన్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్, తిరుపతి ఆర్వో, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, అభ్యర్థులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో అక్రమాలపై ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి నివేదిక సమర్పించేలా అధికారులను ఆదేశించాలని , ప్రభుత్వ అధికారులు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఓటర్లను బెదిరించారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు నియోజకవర్గంలోనే ఉన్నారు. నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు పంచిపెట్టారు. దొంగ ఓట్లు వేసేవారిని బస్సుల్లో తీసుకొచ్చారు. ఈ వ్యవహారమంతటినీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా , వేలమంది తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులోకి ప్రవేశించి ఓట్లు వేశారు. ఈ అంశాల దృష్ట్యా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటు ఉప ఎన్నికను రద్దుచేసి, రీ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించండి అని కోరారు.