Begin typing your search above and press return to search.
తిరుపతి ఎంపీకి లడ్డూ లాంటి పోస్ట్
By: Tupaki Desk | 20 Dec 2022 2:30 PM GMTఆయన వెరీ లక్కీ అనుకోవాలి. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికలో పోటీ చేయలేదు. కానీ కరోనా కారణంగా మృతి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ స్థానంలో ఆయన 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. అలా ఎంపీ అయిన గురుమూర్తి గత రెండేళ్ళ కాలంలో పార్లమెంట్ లో బాగానే ఉనికి చాటుకుంటున్నారు.
లేటెస్ట్ గా చూస్తే ఆయనకు ప్రతిష్టాత్మకమైన పదవి ఒకటి లభించింది. ఆ పదవిని అందుకున్న గురుమూర్తి వెరీ వెరీ లక్కీ అంటున్నారు. ఇంతకీ ఆ పదవి ఏంటి అంటే కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్
ఈ సంస్థ కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ గురుమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించడం విశేషం. ఇది స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఇదిలా ఉంటే ఈ రోజున దేశంలో ఫార్మాస్యూటికల్ రంగమే నంబర్ వన్ గా ఉంది. ఎంతో మంది అగ్రశ్రేణి ధనవంతులు ఉంటే వారిలో టాప్ లెవెల్ లో ఉన్న వారు అంతా ఈ రంగానికి చెందిన వారే కావడం విశేషం.
ఈ రంగంలో ఇంకా ఎంతో అభివృద్ధి చేసే అవకాశాలు దేశంలో ఉన్నాయి. ఇపుడు ఏర్పాటు అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చేయాల్సింది చాలానే ఉంది. ఎంతో బృహత్తరమైన ఆశంతో ఈ సంస్థను కేంద్రం నెలకొల్పింది. దేశీయంగానే కాకుండా అగ్నేయాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు కూడా రసాయన ఎగుమతులు, దిగుమతులు, శాస్త్రసాంకేతిక సహాయ సహకారాలను అందించడానికి ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.
ఇక కేంద్రం ఈ దిశగా అడుగులు వేసి ఏర్పాటు చేసిన మొదటి జాతీయ సంస్థ ప్రతిష్ట కలిగిన దాంట్లో ఏపీ ఎంపీకి చోటు దక్కడం విశేష పరిణామమే అని చెప్పుకోవాలి. మొత్తం పది మంది సభ్యులు ఉంటే అందులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒకరుగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తనకు దక్కిన ఈ అరుదైన అవకాశం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యార్మాస్యూటికల్ రంగం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తాను అని చెప్పుకొచ్చ్చారు. ఏపీలో రసాయనిక పరిశ్రమల ఏర్పాటుకు తన తోడ్పాటుని అందిస్తాను అని కూడా తెలియచేశారు. ప్రస్తుతం ఉన్న వాటిని మరింతంగా మెరుగులు దిద్ది అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. మొత్తానికి లేట్ గా ఎంపీ అయినా లేటెస్ట్ గా మంచి పదవిని సాధిచిన గురుమూర్తి నిజంగా గ్రేటే అని అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.