Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తిరుపతి - నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

By:  Tupaki Desk   |   16 March 2021 12:24 PM GMT
బ్రేకింగ్: తిరుపతి - నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
X
మళ్లీ తెలుగు రాష్టాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్, తిరుపతి ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17 ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 23న ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండా.. తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరితో పాటు మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలులో ఉండటంతో.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించలేదు. రెండు రోజుల క్రితం ఈ ఎన్నికలు అయిపోవడంతో తాజాగా నాగార్జునసాగర్‌తో పాటు ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

*నాగార్జున, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
- మార్చి 23న నోటిఫికేషన్ విడుదల
- మార్చి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
- మార్చి 31న నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
- ఏప్రిల్ 17న పోలింగ్
- మే 2న ఓట్ల లెక్కింపు