Begin typing your search above and press return to search.

తిరుప‌తి ఉప ఎన్నిక‌: జ‌న‌సేనకు చిక్కులే

By:  Tupaki Desk   |   19 Nov 2020 2:30 AM GMT
తిరుప‌తి ఉప ఎన్నిక‌: జ‌న‌సేనకు చిక్కులే
X
తిరుప‌తి ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న ద‌రిమిలా.. ఇత‌ర పార్టీల్లో ఒక విధ‌మైన జోష్ క‌నిపిస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారుపై పైచేయి సాధించేందుకు టీడీపీ, కాంగ్రెస్ స‌హా బీజేపీ కూడా ఉత్సాహంతో ఉర‌క‌లు పెడు తున్నాయి. కానీ, పాతిక సంవ‌త్స‌రాల సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేన‌లో మాత్రం తిరుప‌తి ఉప పోరు జోష్ నింప‌క‌పోగా.. అనేక చిక్కుల‌ను తెర‌మీదికి తెస్తోంది. గ‌త ఏడాదిలో పుంజుకుని.. దాదాపు అధికారంలోకి రావ‌డ‌మో.. లేదా అధికారంలోకి వ‌చ్చే పార్టీని నిర్దేశించ‌డ‌మో చేస్తుంద‌ని అనుకున్న జ‌న‌సేన ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసుకుంది. కేవ‌లం ఒకే ఒక్క‌స్థానంలో గెలుపు గుర్రం ఎక్కిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కూడా వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిపోయారు.

ఇక‌, అప్ప‌టి నుంచి జ‌న‌సేన మౌనం పాటిస్తోంది. వాస్త‌వానికిత‌న‌కు గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేదని జేన‌సేనాని ప‌వ‌న్ అనేక సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించారు. అయితే.. దానికి త‌గిన విధంగా ఆయ‌న ఎక్క‌డా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ముందుకు సాగింది లేదు. పైగా.. మీరంద‌రూ.. సంపాయించుకుంటున్నా రు... నేనెందుకు ఖాళీగా ఉండాలి-అంటూ.. సినిమాల్లోకి వెళ్లిపొయారు. ఈ ప్ర‌భావం పార్టీపై తీవ్రంగా ప‌డింది. కార్య‌క‌ర్త‌లు క‌కావిక‌లం అయ్యారు. మేధావులు అనుకున్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వంటివారు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇదిలావుంటే.. బీజేపీతో నెయ్యానికి చేతులు క‌ల‌ప‌డం పార్టీని మ‌రిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. పైకి ప్ర‌త్య‌క్షంగా ఈ ఎఫెక్ట్ ఇప్పుడు క‌నిపించ‌క‌పోయినా.. అండ‌ర్ క‌రెంట్ మాదిరిగా ప‌నిచేస్తోంది.

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీతో జ‌గ‌న్ అంట‌కాగ‌డంపై.. రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేకత ఉంది. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కొన్నాళ్లు దూకుడుగాఉ న్న ప‌వ‌న్‌..త‌ర్వాత బీజేపీతో చెలిమి నేప‌థ్యం లో ఈ విష‌యాన్ని పూర్తిగా మ‌రిచిపోయారు. ఈ ప‌రిణామం.. అమ‌రావ‌తి ప్రాంతం స‌హా గుంటూరు , కృష్ణాజిల్లాలపై ప‌డింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన విష‌యంలో పాజిటివిటీ ఉన్న వారు కూడా వ్య‌తిరేకించ‌డం ప్రారంభించారు. ఇక‌, ఇప్పుడు ఉప ఎన్నిక విష‌యంలో జ‌న‌సేన వ్య‌వ‌హ‌రించే తీరు కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బీజేపీతో చెలిమి ఉన్నందున ఆ పార్టీకి మ‌ద్ద‌తిస్తుందా? లేదా త‌నే స్వ‌యంగా పోటీకి దిగుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఈ రెండు విష‌యాల్లో జన‌సేన దేనిని ఎంచుకున్నా.. అంతిమంగా.. రెండు కీలక ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ప‌వ‌న్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీతో క‌లిసినా.. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌య‌త్నిస్తారా? అమ‌రావ‌తిపై స్టాండ్ ఏంటి? అనేవి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. రేపు ఇవే విష‌యాలు తిరుపతి ఉప పోరులో ప్ర‌ధానంగా జ‌న‌సేన‌ను టార్గెట్ చేయ‌నున్నాయి. బీజేపీ హోదా ఇవ్వ‌దు.. అమ‌రావ‌తిపై నోరు విప్ప‌దు. మ‌రి ఆ పార్టీకి మ‌ద్ద‌తిస్తున్న జ‌న‌సేన ఏం చేయ‌నుంది? అనేది తిరుప‌తి ఉప‌పోరుతో స్ప‌ష్టం అయిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.