Begin typing your search above and press return to search.
ఆ దేశ బార్బర్స్ కు ‘టైటానిక్’ భయం.. !
By: Tupaki Desk | 31 Aug 2021 5:30 AM GMTహాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘టైటానిక్’ గురించి సినీ లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఎన్నో సంచనాలను సృష్టించి, ప్రొడ్యూసర్స్‌కు బోలెడు లాభాలు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలోని హీరో డికాప్రియో బీటిల్ కట్ హెయిర్ స్టైల్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి అందరికీ విదితమే. అయితే, ‘టైటానిక్’ సినిమా వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అమలులో ఉంది. కాగా, అప్పట్లో ఆ హెయిర్‌స్టైల్‌ను యూత్ బాగా లైక్ చేసింది. ఆ హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేందుకుగాను బార్బర్ షాపులకు యువకులు క్యూ కట్టారు. ఇక్కడే సమస్య షురూ అయింది.
తాలిబన్ల పాలనలో షరియా చట్టాల ప్రకారం పాశ్చాత్య పోకడలను అనుసరించడం తీవ్రమైన నేరం. గవాళ్లు జుట్టు, గడ్డాలు పెంచుకోవాలని వారి ఆప్ఘన్ తాలిబన్ల చట్టాలు చెబుతున్నాయి. కానీ, వాటిని వ్యతిరేకించి యువకులు బీటిల్ కట్‌తో కనిపించడం స్టార్ట్ చేశారు. అలా బీటిల్ కట్ హెయిర్ స్టైల్‌తో కనిపించిన యువకులను తాలిబన్లు ఆయా ప్రాంతాల నుంచి తీసుకెళ్లి గుండ్లు కొట్టించారు. అలా చేస్తున్నప్పటికీ యూత్‌లో మార్పు లేకపోవడంతో బార్బర్ షాపులనూ మూయించేశారు. అంతటితో ఆగకుండా బార్బర్లను చితకబాదారు. కాగా, తాలిబన్ల కాలంలో వేలాది బార్బర్ షాపులను క్లోజ్ కాగా, వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ఇప్పుడు మరోసారి తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఇక తమకు ఎలాంటి పని ఉండదని, షాపులు మూసేసి పరిస్థితులు వస్తాయేమోనని, మళ్లీ తాము వేరే పనులు చూసుకోవాల్సిందేనని అంటున్నారు బార్బర్ షాపు యజమానులు. ఇకపోతే తాలిబన్లు కాబుల్ సిటీలోకి ప్రవేశించినట్లు తెలిసిన నాటి నుంచే వెంటనే యూత్ ఇంటి నుంచి బయటకు రాకుండా గడ్డాలు పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘టైటానిక్’ సినిమా ఎఫెక్ట్.. ఇప్పుడు కూడా ఆ దేశం పై పడనుందా లేదా.. చూడాలి మరి ఏమవుతుందో.. ఆప్ఘన్ దేశంలోని యువకుల పరిస్థితి మాత్రమే కాకుండా బార్బర్స్ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారే చాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఒక సినిమాలో మాదిరిగా హెయిర్ స్టైల్ పెంచుకుంటేనే వారి గుండు కొట్టించే పరిస్థితులు ఉన్నాయంటే.. ఆ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యక్తిగత హక్కులు, ప్రాధాన్యత గురించి అస్సలు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అయితే, ఆప్ఘనిస్తాన్ దేశంలో చాలా మంది ప్రస్తుతం భయాందోళనలోనే ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతున్నదనే చెప్పొచ్చు. ఇప్పటికే ఆ దేశంలో ప్రముఖులతో పాటు చాలా మంది జనాలు ఆ దేశం వదిలి వెళ్లిపోయారు. మహిళలు అయితే సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి పారిపోయారు.
ఇక మిగిలిన వారు తమకు రక్షణ కరువేనని వాపోతున్నారు. ఆప్ఘన్ దేశ సెలబ్రిటీలు సైతం దేశం నుంచి బయటకు వచ్చేశారు. ఆ దేశ తొలి మహిళా, ముస్లిమేతర ఎంపీ ఆప్ఘనిస్తాన్ దేశం నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో తల దాచుకుంటోంది ఆమె. పరిస్థితులు తీవ్రతరం అయితే యూత్ కూడా ఇక అందరూ కట్ట కట్టుకుని దేశం నుంచి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమాచారం.