Begin typing your search above and press return to search.
ప్రజాకూటమిలో ప్రజారాజ్యం సీన్... టిక్కెట్ల సేల్
By: Tupaki Desk | 2 Dec 2018 11:36 AM GMTఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో కనిపించే మద్దతును చూసి సంబర పడుతున్న ప్రజాకూటమికి భారీ షాక్ తగిలింది. ఎవరిని చూసి అయితే ప్రజాకూటమికి భారీ పాజిటివిటీని కాంగ్రెస్ ఊహించుకుందో ఆ శక్తిమీదే దెబ్బ పడింది. టీజేఎస్ ఉపాధ్యక్షురాలు - న్యాయవాది రచనారెడ్డి ప్రజా కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లో కూటమిపై కొత్త అనుమానాలను కలిగించాయి. టిక్కెట్ల పంపిణీకి కొద్ది రోజుల ముందు కోదండరాం వెళ్లగక్కిన ఆవేదన నిజమే అని ఆమె చేసిన తాజా ఆరోపణల ద్వారా అర్థమవుతోంది.
తెలంగాణకు అది తెస్తాం.. ఇది తెస్తాం.. అని చెప్తున్న ప్రజా కూటమి మాటలన్నీ బూటకాలే అని రచనా రెడ్డి దుమ్మెత్తి పోశారు. ప్రజా కూటమి తెలంగాణ పాలిట విషకూటమి అని - అందులో అందరివీ చిల్లర వేషాలు అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పుకున్న కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉత్తిదేనని ఆమె కొట్టిపారేశారు. ఎన్నికల తర్వాత గెలిచినా - ఓడినా ఇతర పార్టీల నేతలంతా కోదండరామ్ ఫోన్ కూడా ఎత్తరని ఆమె వ్యాఖ్యానించడం కోదండరాం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ప్రజాకూటమిని ఇబ్బంది పెట్టేవే.
కూటమిలో కోదండరాం ఉండటంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పొసగని పార్టీలతో కోదండరాం ఎలా కలిశాడా అని జనంలో పెద్ద అనుమానమే ఉంది. దానికి కూడా రచనా రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. కోదండరామ్ కూటమిలో కలవడం ముమ్మాటికీ తప్పేనన్నారు ఆవిడ.
ఇక టీజేఎస్ పై కూడా ఆమె ఆరోపణలు చేశారు. పార్టీలో సామాజిక న్యాయం కరువైందన్నారు. కోదండరాం తీరుతో క్యాడర్ పూర్తిగా నష్టపోయిందన్నారు. టీజేఎస్ - కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల్లో భేరసారాలు జరగడం పార్టీని కుంగదీసిందని - ప్యారాచ్యూట్ నేతలకు టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నారని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం. దీనిపై టీజేఎస్ కోర్ కమిటీలో చాలాసార్లు వాదనలు - గొడవలు జరిగిన విషయాన్ని ఆమె బయటపెట్టారు. టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రత్యామ్నాయమే కాదన్న రచనారెడ్డి జనసమితిలో ఒక్క మైనారిటీకి టిక్కెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మినవాళ్లను కోదండరాం నట్టేట ముంచారని ఆవేదన చెందారు. కోదండరాం కావాలనే కాంగ్రెస్ తో కలిసి ఓడిపోబోతున్నారని.. ఆయనలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె చెప్పారు.
కూటమి పేరుతో తెలంగాణ ప్రజలకు మోసం జరుగుతోందని - దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు సీట్లు పంచుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం తప్పేనన్నారు. బలహీనులకు టిక్కెట్లు ఇచ్చారు. నాలుగేళ్లుగా అన్యాయంపై పోరాడుతున్న వారికి నామం పెట్టారు. ఇట్లా ఉంటే కూటమి ఎలా ముందుకు పోయి గెలుస్తుందని ఆమె ప్రశ్నించారు.
మరో రెండు సీక్రెట్లు కూడా వెల్లడించారావిడ. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి 40 సీట్లు అడిగారట. వారు కాదనడంతో కాంగ్రెస్ తో కలిశారట. ఈ విషయాన్ని ఆమెతో పాటు మాట్లాడిన మర్రి ఆదిత్యరెడ్డి చెప్పారు. అసలు ఉప్పల్ సీటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు దక్కాల్సింది. దానిని దేవేందర్ గౌడ్ కుమారుడికి ఇచ్చారు. ప్రతిచోటా ఇలాంటి ద్రోహమే జరిగిందన్నారామె.
మొత్తానికి ఎంతో ఉత్సాహంతో ఉన్న కూటమిలో రచనారెడ్డి కుంపట్లు రాజేసింది. ఆమె వ్యాఖ్యలు టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆనందం నింపగా... కూటమి నేతలకు కంటగింపుగా మారాయి. మొత్తానికి ఈ ఆరోపణలు ఇక్కడితో ఆగుతాయా.. రాబోయే ఐదు రోజుల్లో ఇంకా ఏమైనా బయటకు వస్తాయా ? అన్నది తేలాల్సి ఉంది.