Begin typing your search above and press return to search.
కలకత్తా హైకోర్టులో టీఎంసీ న్యాయవాదుల ఓవరాక్షన్
By: Tupaki Desk | 14 April 2022 1:30 AM GMTపశ్చిమ బెంగాల్ లో ఏది చేసినా సంచలనమే. వారు ఎంతకైనా తెగిస్తారు. దేన్నయినా బదనాం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో కోల్ కత హైకోర్టు స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కేసులోె వెలువడిన తీర్పుతో వివాదం నెలకొంది. దీంతో న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి దూషణలకు దిగడం తెలిసిందే. టీఎంసీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. కేసులో రాజకీయ జోక్యంపై అందరిలో ఆగ్రహం పెరిగింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అడ్డు తగలడం తెలిసిందే.
ఇప్పటికే బీజేపీ, టీఎంసీకి మద్య అభిప్రాయభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టీఎంసీ మధ్య పోటీ తీవ్రమైంది. చివరకు టీఎంసీ విజయం సాధించడంతో రెండు పార్టీల మధ్య రగడ రాజుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ గది ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు నిరసన చేపట్టడం వివాదాలకు కారణమైంది.
జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన తీర్పు సమంజసమే అని కొందరు న్యాయవాదులు సైతం మద్దతు తెలపడం తెలిసిందే. దీంతో కలకత్తా బార్ అసోసియేషన్ రెండుగా విడిపోయింది. ఎస్ ఎస్సీ కేసులో పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెలువడిన తీర్పుపై టీఎంసీ ఆందోళన చేయడం వివాదాలకు కారణమవుతోంది.
ఈ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ బెంచ్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ సీబీఐ విచారణకు హాజరు కావాలని సూచించింది. దీనిపై నిందితుడు ఏరకమైన సాకులు చూపుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని చెప్పింది. దీంతో టీఎంసీ నేతలు స్పందించి న్యాయస్థానం వెలువరించిన తీర్పును తప్పుబడుతూ గొడవకు దిగడం వారి అనైతికతకు నిదర్శనమే.
ఆస్పత్రిలో చేరడం, ఆరోగ్యం బాగా లేదని చెప్పడం వంటివి చేయరాదని కోర్టు సూచించడంతో టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టడం విచారకరమే. ఇందులో భాగంగానే జస్టిస్ గంగాపాధ్యాయను కోర్టు భవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.. జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పుపై కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం ఉదయం వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ లో టీఎంసీ కార్యకర్తల తీరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
మొత్తానికి కలకత్తాలో రగులుతున్న వివాదంతో టీఎంసీ కార్యకర్తల అత్యుత్సాహమే కనిపిస్తోంది. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి జడ్జిని టీఎంసీ అనుకూల న్యాయవాదులు అడ్డుకోవడం సమంజసం కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో నగరం మొత్తం అట్టుడుకుతోంది. న్యాయవాదుల తీరుపై అందరిలో ఆగ్రహం వస్తోంది. తమ వారిని రక్షించుకునేందుకు రాజకీయ పార్టీ నేతలు రంగంలోకి దిగడం నిజంగా దురదృష్ట కరమే.