Begin typing your search above and press return to search.

మమతా బెనర్జీ మేనిఫెస్టోః ఏడాదికి రూ.12 వేలు.. వాళ్లకు రూ.10 లక్షలు!

By:  Tupaki Desk   |   17 March 2021 2:37 PM GMT
మమతా బెనర్జీ మేనిఫెస్టోః ఏడాదికి రూ.12 వేలు.. వాళ్లకు రూ.10 లక్షలు!
X
ప‌శ్చిమ బెంగాల్లో ప‌రిస్థితి మామూలుగా లేదు. టీఎంసీ-బీజేపీ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో.. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వ‌రాల జ‌ల్లు కురిపించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. బుధ‌వారం ఆమె ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో ఓట‌ర్ల‌పై హామీల వ‌ర్షం కురిపించారు. ఇందులో భాగంగా.. నిరుపేద‌ల ఎస్సీ, ఎస్టీల‌కు సంవ‌త్స‌రానికి రూ.12 వేల ఆర్థిక స‌హాయం అందించేందుకు ఓ ప‌థ‌కం రూపొందిస్తామ‌న్నారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం 5 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇక‌, రైతుల‌కు ప్ర‌తీ సంవ‌త్స‌రం అందించే ప్రోత్సాహ‌కాల‌ను రూ.6 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచుతామ‌ని వాగ్ధానం చేశారు. ఉన్న‌త విద్య చ‌దివే వారికి రూ.10 ల‌క్ష‌ల విలువ చేసే క్రెడిట్ కార్డుల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు గానూ 4 శాతం వ‌డ్డీ మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్పారు.

ఇక‌, ప్ర‌జ‌ల ఇళ్ల వ‌ద్ద‌కే రేష‌న్ స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని కూడా ప్రారంభిస్తామ‌న్నారు. వితంతు పెన్ష‌న్ గా వెయ్యి రూపాయ‌లు ఇస్తామ‌ని, అల్ప ఆదాయ వ‌ర్గాల‌కు చెందిన వారైతే.. వారికి ఏటా రూ.6 వేలు, రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య‌బీమా క‌ల్పిస్తామ‌ని చెప్పారు మమ‌త‌. అదేవిధంగా నిరుపేద‌ల‌కు 25 ల‌క్ష‌ల ఇళ్లు కట్టిస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు. ఇది రాజ‌కీయ మేనిఫెస్టో కాద‌న్న దీదీ.. రాష్ట్ర‌, ప్ర‌జ‌ల అభివృద్ధి నివేదిక అని చెప్పారు.