Begin typing your search above and press return to search.
స్పీకర్ దండాన్ని తీసుకొని పరుగులు పెట్టిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 20 Dec 2016 7:47 AM GMTత్రిపుర అసెంబ్లీలో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శీతాకాల సమావేశాల్లో ఆఖరి రోజున చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుదీప్ బర్మన్.. స్పీకర్ టేబుల్ మీద ఉన్న అధికార దండం (గద మాదిరిది) ఒక్క ఉదుటున తీసుకొని అసెంబ్లీలో పరుగులు తీశారు.
ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న సభ్యులు కొందరు ఆయన్ను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది సైతం ఆయన్ను పట్టుకోవటంలో విఫలమయ్యారు. గదతో బయటకు వెల్లిపోయిన ఆయన్ను.. అసెంబ్లీ బయట అసెంబ్లీ సిబ్బంది పట్టుకొని గదను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికార దండాన్ని స్పీకర్ కు అందజేశారు.
ఇంతకీ సదరు ఎమ్మెల్యే అంత రచ్చ చేయటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. అటవీశాఖా మంత్రి జమాతియా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నది విపక్ష ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై సభలో చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించటంతో తృణమూల్ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి.. స్పీకర్ టేబుల్ మీదున్న అధికార దండాన్నితీసుకొని ఒక్క పరుగు తీశారు. ఆయన్ను పట్టుకొనేందుకు త్రిపుర అసెంబ్లీలో పెద్ద ప్రహసనమే నడిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను చేసిన పనికి సదరు సభ్యుడు స్పీకర్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. కొసమెరుపు ఏమిటంటే.. త్రిపుర అసెంబ్లీలో స్పీకర్ అధికారదండాన్ని ఎమ్మెల్యేలు ఇలా తీసుకొని పరుగులు పెట్టటం ఇది మూడోసారట. త్రిపుర అసెంబ్లీ సీన్ తో మిగిలిన రాష్ట్రాల ఎమ్మెల్యేలు కానీ స్ఫూర్తి పొందితే కష్టమే సుమి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/