Begin typing your search above and press return to search.
కుర్ర చేష్టలతో తిట్లు తిన్న యువ ఎంపీలు!
By: Tupaki Desk | 29 May 2019 5:31 AM GMTరోమ్ లో రోమన్ లా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో కూడా చెప్పించుకునే పరిస్థితుల్లో ఉన్న వారు ఎంపీలుగా ఎన్నిక కావటానికి మించిన దురదృష్టం మరొకటి ఉండదేమో? తాజాగా తమ తీరుతో తిట్లు తినటమే కాదు.. వారిని ఎన్నుకున్న ఓటర్లకు సైతం తలవంపులు తెచ్చిన వైనం తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో గెలిచిన ఆ ఇద్దరు బెంగాలీ నటీమణుల సొంతంగా చెప్పాలి.
కుర్ర చేష్టలతో వారు చేసిన పనికి పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు బెంగాల్ నటీమణులు మిమి చక్రవర్తి.. నుస్రత్ జహాన్. ఎంపీలుగా ఎన్నికైన వారిద్దరు సోమవారం పార్లమెంటును సందర్శించారు. అక్కడి వరకూ ఎలాంటి సమస్యా లేకున్నా.. అక్కడ వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్కడితో రచ్చ షురూ అయ్యింది.
పార్లమెంటు సందర్శన కోసం మోడ్రన్ డ్రెస్సుల్లో వెళ్లి.. ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ ఇద్దరు మహిళా ఎంపీలపై నెటిజన్లు విపరీతంగా తప్పు పట్టారు. ఫోటోలు దిగేందుకే పార్లమెంటుకు వెళ్లారా? అంటూ వారిని ప్రశ్నించారు. తృణమూల్ మీకు ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చింది? కుర్ర చేష్టలతో బెంగాల్ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారి హక్కుల్ని కాపాడేందుకు ఎన్నుకుంటే.. ఫోటోల పేరుతో డ్రామాలు ఆడుతున్నారా? అంటూ కడిగిపారేశారు.
ప్రజాప్రతినిధి అంటే హుందాగా ఉండాలని.. అలాంటిదేమీ లేకుండా సినిమా షూటింగ్ లో మాదిరి ట్రెండీ లుక్ అవసరమా? అంటూ మరొకరు ఫైర్ అయ్యారు. జాదవ్ పూర్ నుంచి మిమి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నుస్రత్ బసిర్హాత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీలుగా ఎన్నికయ్యారన్న ఉత్సాహం తప్పు లేదు కానీ మితిమిరీన ఉత్సాహంతో ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని మర్చిపోకూడదు.