Begin typing your search above and press return to search.

కమలాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్: నోటీసులు జారీ..

By:  Tupaki Desk   |   6 Dec 2021 10:30 AM GMT
కమలాసన్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్: నోటీసులు జారీ..
X
ప్రముఖ నటుడు కమలాసన్ ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. ఆయన అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కాస్త అనారోగ్యంగా ఉండడంత పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకొని డిశ్చార్చ్ అయ్యారు. అయితే వెంటనే బిగ్ బాస్ షో లో కమల్ కనిపించడంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ఐసోలేషన్లో ఉండాలి. కానీ ఆ నిబంధనలు పట్టించుకోకుండా బాధ్యత రాహత్యంగా ప్రవర్తించడం సమంజసం కాదని తెలిపింది. ఆ విషయంపై వివరణ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది.

దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకు రెట్టింపుగా నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. అయితే సామాన్యలకు బాధ్యతలు చెప్పాల్సింది పోయి ఓ సెలబ్రెటి ఇలా కరోనా నిబంధనలను పట్టించుకోకపోతే ఎలా..? అని ప్రభుత్వం ప్రశ్నించింది.

అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కమల్ హాసన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే మరోసారి టెస్ట్ చేయించుకున్న తరువాత నెగెటివ్ రిపోర్టు వచ్చింది. హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటనే నెగెటివ్ రిపోర్టు రాగానే చాలా మంది ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు.

కానీ కమల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం వల్ల కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. నెగెటివ్ రిపోర్టు రాగానే పూర్తిగా నయం అయినట్లు కాదని, కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని తెలిపింది.

కరోనా పూర్తిగా తగ్గగమందే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? అని ప్రభుత్వం ప్రశ్నించింది.

దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అయితే దీనిపై కమల్ ఎలా సమాధానం ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమిళనాడులో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయ. ఇప్పటికే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే చెన్నైలోకి అనుమతించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.