Begin typing your search above and press return to search.

ప‌ళ‌నిస్వామి స‌ర్కార్ కు షాక్‌.. గ‌వ‌ర్న‌ర్ పాల‌న?

By:  Tupaki Desk   |   22 Nov 2017 5:14 AM GMT
ప‌ళ‌నిస్వామి స‌ర్కార్ కు షాక్‌.. గ‌వ‌ర్న‌ర్ పాల‌న?
X
అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన సంచ‌ల‌నాల ప‌ర్వం ఒక ప‌ట్టాన తెర ప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌టం లేదు. అనారోగ్యంతో చెన్నై అపోలోకు అమ్మ చేరిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏదో ఒక రాజ‌కీయ సంచ‌ల‌నం చోటు చేసుకుంటూనే ఉంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తున్న వేళ‌.. ఢిల్లీ నుంచి అక‌స్మాత్తుగా ఇద్ద‌రు పీఎంవో కార్య‌ద‌ర్శులు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌ కు కార్య‌ద‌ర్శులుగా నియ‌మించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకిలా జ‌రిగింది? ఏం జ‌రుగుతోంది? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ఇలాంటి సీనే జ‌రిగింద‌ని.. ఆ త‌ర్వాత రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌ను విధించిన‌ట్లుగా చెబుతున్నారు. హిస్ట‌రీ రిపీట్ అన్న‌ట్లుగా గ‌తంలో ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేశారో.. తాజాగా అలాంటి వ్యూహాన్నే అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే అవున‌నే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం ప‌ళ‌నిస్వామి.. ప‌న్నీర్ సెల్వంతో కూడిన ప్ర‌భుత్వం అధికారాన్ని చెలాయిస్తోంది. వీరి స్థానంలో త‌మ‌దైన ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ వ్యూహానికి తెర తీసిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.

తాజాగా ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రీలాల్ పురోహిత్‌ కు ఇద్ద‌రు కార్య‌ద‌ర్శులుగా ప్ర‌ధాన‌మంత్రికార్యాల‌యంలో ప‌ని చేస్తున్న ఐఏఎస్ ల‌ను నియ‌మించిన‌ట్లుగా తెలుస్తోంది. పీఎంవోలో ప‌ని చేస్తున్న ఐఏఎస్ అధికారులు రాజ‌గోపాల్.. సోమ‌నాథ‌న్ ల‌ను నియ‌మించారు. పీఎంవోలో ప‌ని చేసే కార్యద‌ర్శుల్ని త‌మిళ‌నాడు రాజ్ భవ‌న్‌ కు ఎందుకు పంపుతున్నారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. దీనికి రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న‌దేమంటే.. వ‌చ్చే నెల‌లో (డిసెంబ‌రు) గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధిస్తార‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదే రీతిలో గ‌తంలోనూ గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌ను విధించే ముందు పీఎంవోకు చెందిన ఐఏఎస్ అదికారుల్ని రాష్ట్రానికి పంపి.. కొద్ది కాలానికే గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించిన ఘ‌న చ‌రిత్ర లేక‌పోలేదు. అందుకు సంబంధించి రెండు ఉదంతాల్ని ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు.

గ‌తంలో ఏం జ‌రిగింది?

1976లో క‌రుణానిధి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వేళ‌లోనూ అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ కాళీదాస్ షాకు ఇద్ద‌రు పీఎంవో అధికారుల్ని కార్య‌ద‌ర్శులుగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పీఎంవో నుంచి అధికారుల్ని గ‌వ‌ర్న‌ర్ కు కార్య‌ద‌ర్శులుగా నిమించిన అనంత‌రం ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే రీతిలో ఎంజీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా కేంద్రం వ్య‌వ‌హ‌రించింది. ఎంజీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత 1988లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించారు. దానికి కొంత‌కాలం ముందు పీఎంవో నుంచి ఇద్ద‌రు ఐఏఎస్ లు రాజ్ భ‌వ‌న్‌కు కార్య‌ద‌ర్శులుగా వ‌చ్చారు. సో.. తాజాగా కూడా అలాంటిదే జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో రాజ‌కీయంగా కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ విధుల‌కు లోబ‌డే ప్ర‌భుత్వ అధికారుల‌తో గ‌వ‌ర్న‌ర్ స‌మావేశ‌మైన‌ట్లుగా రాజ్ భ‌వ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టంపై డీఎంకే నేత స్టాలిన్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం విధులు నిర్వ‌హించే వారే అయితే.. మైనార్టీలో ఉన్న ప‌ళ‌నిస్వామి ప్ర‌బుత్వాన్ని బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల‌ని అసెంబ్లీని స‌మావేశ ప‌రుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే మ‌రో కీల‌క‌మైన అంశం ఏమిటంటే.. జ‌య‌టీవీ చ‌రిత్ర‌లో తొలిసారిగా అమ్మ తీవ్రంగా వ్య‌తిరేకించే డీఎంకే పార్టీకి చెందిన నేత డి.దురైమురుగ‌న్ ఇంట‌ర్వ్యూను ప్ర‌సారం చేశారు. ఎందుకిలా అన్న దానిపై కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.