Begin typing your search above and press return to search.

ప‌న్నీర్ జోస్యం..ప‌ళ‌నిస్వామికి షాకులు

By:  Tupaki Desk   |   8 May 2017 9:47 AM GMT
ప‌న్నీర్ జోస్యం..ప‌ళ‌నిస్వామికి షాకులు
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఊహించ‌ని చిక్కుల్లో ప‌డుతోంది. చిన్న‌మ్మ శ‌శిక‌ళ జైలు పాల‌వ‌డం, అనంత‌రం ఆమె అక్క కుమారుడు దిన‌క‌ర‌న్ వ్య‌వ‌హార‌శైలి కార‌ణంగా ఇర‌కాటంలో ప‌డిన ప‌ళ‌ని వ‌ర్గం ఇప్పుడు ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార‌ణంగా చుక్క‌లు చూస్తోంది. పెద్దనోట్లు రద్దు తరువాత ఐటీ శాఖ అధికారులు చెన్నైలోని టీనగర్ లో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అదే సమయంలో శేఖర్ రెడ్డి గదిలో అధికారులు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డైరీ ఆధారంగా ఐటీ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీ నగర్‌లోని శేఖర్‌ రెడ్డి ఇంట్లో సాగిన దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో అనేక కీలక ఆధారాలు, లెక్కలోకి రాని నగదు, డైరీలు ఐటీ వర్గాలకు చిక్కాయి. ఇందులో ఓ డైరీలో కాంట్రాక్టర్‌గా తాను పొందిన లబ్ధికి ప్రతిఫలంగా కమీషన్లు పొందిన వారి వివరాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పలువురు మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల పేర్లుకూడా ఉన్న సమాచారం చర్చకు దారి తీసింది. కాగా ఈ లేఖ గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఆదాయపన్ను శాఖ అధికారులు లేఖ రాశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ ఐటీ శాఖ అధికారులు సీఎం పళనిస్వామికి లేఖ రాసిన‌ట్లు చెప్తున్నారు. శేఖర్ రెడ్డి డైరీలో ఉన్న కమీషన్ల చిట్టా (లంచం) వివరిస్తూ సీఎం పళనిసామి ఐటీ శాఖ లేఖ సంధించడం పెద్ద చర్చకు దారితీసింది. శేఖర్ రెడ్డి వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఐటీ శాఖ అధికారులు ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఇవ్వడంతో పళనిసామి ప్రభుత్వం ఆందోళనకు గుర‌వుతోంది. కాగా ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డార‌ని అంటున్నారు. శేఖర్‌రెడ్డి వ్యవహారం ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు ఆదాయపన్ను శాఖల చేతిలో ఉన్నా, ఆ డైరీ రూపంలో సంకటం మాత్రం పళని ప్రభుత్వానికి తప్పదేమోనన్న ఉత్కంఠ బయలు దేరింది. ఆ సమయంలో తాను సీఎంగా లేనప్పటికీ తాజాగా అప్పటి భారాన్ని తాను మోయాల్సిన పరిస్థితి పళనిసామికి తప్పడం లేని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు అన్నాడీఎంకేలోకి విలీనం అంటూ కొన్నాళ్లు సమయాన్ని సాగదీసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం, త‌న రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టే సమయంలో చేసిన ప్రకటన కొత్త చర్చకు తెర లేపింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని ఆయన చేసిన వ్యాఖ్యలతో పళని శిబిరంలో కలవరం బయలు దేరింది. మొత్తంగా ఇప్పుడు ప‌ళ‌ని తీవ్ర‌మైన క్రాస్ రోడ్స్‌లో ఉన్నార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/