Begin typing your search above and press return to search.
గుంటూరులో కరోనా కల్లోలం ...సోషల్ మీడియా సృష్టే .. తేల్చేసిన టీఎన్ ఎం !
By: Tupaki Desk | 28 Feb 2020 5:45 AM GMTకరోనా వైరస్ ( కోవిడ్ -19 ) ...చైనాలోని వూహన్ లో పుట్టిన ఈ ప్రాణాంతరకరమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా చైనా ఈ వైరస్ ప్రభావంతో చావు కోరల్లో చిక్కుకుపోయింది. కరోనా వైరస్ తో ఇప్పటికే అక్కడ 2700 కు పైగా మంది మృతిచెందారు. ఇతర దేశాల్లో కూడా వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాపించిందనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియా లో విస్తృతం గా జరుగుతోంది. 10 మందికి వైరస్ సోకిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. గుంటూరులో వైరస్ జాడ ఉందని.. 10 మందికి సోకిందని వీడియో పోస్ట్ అవుతోంది. ఇందులో నలుగురు చని పోయారని కూడా ఉంది. కానీ దీనిని ఏపీ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి.
దీంతో టీఎన్ ఎం ప్రతినిధులు రంగంలోకి దిగి, దీనిపై విచారణ సాగించారు. ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కు సంబంధించి అనుమానిత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చింది. కరోనా వైరస్ కాదు గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలినందున మాస్క్ ధరించాలని కోరుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వీడియోలో కొందరు చెబుతున్నారు.
అలాగే మాంసాహారం కూడా తినొద్దని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీలో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఒక వైరస్ ఉంది. ఆ వైరస్ ప్రభావం కనిపించకుండా ..మాస్క్ లు ధరించమని చెప్తున్నారు. అంతే, కానీ, కరోనా వైరస్ వచ్చింది అని మాస్క్ లు ధరించమనడంలేదు. మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 అనే మందును కనుక్కొందని ప్రచారం జరుగుతోంది. అయితే , దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మందు ఇంకా కనుగొనలేదని స్పస్టంచేసింది.