Begin typing your search above and press return to search.
కేసీఆర్ గృహప్రవేశానికి ఆటంకం?
By: Tupaki Desk | 21 Nov 2016 10:37 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ముచ్చటపడి కట్టుకున్న కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకుని సంబరపడుతున్న తరుణంలో అనుకోని వ్యతిరేకత ఎదురవుతోంది. విద్యార్థుల ఫీజు రీయెంబర్సుమెంటు బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి కొత్త ఇంటి గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామంటూ విద్యార్థి సంఘం టీఎన్ ఎస్ ఎఫ్ హెచ్చరిస్తోంది. విద్యార్థుల జీవితాలతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపిస్తోంది.
ఈ రోజు సెక్రటేరియట్ వద్ద టీఎన్ ఎస్ ఎఫ్ ధర్నా చేసిన సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బకాయిలను విడుదల చేయడానికి ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు విధిస్తున్నామని.. ఆలోగా రూ. 2090 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు. తాము ఇచ్చిన సమయంలోగా బకాయిలను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
కాగా ఐపీఎస్ ల క్వార్టర్లను కూల్చి సీఎం అక్కడ అధికార నివాసాన్ని పూర్తి వాస్తు ప్రకారం నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇంటికి అన్ని హంగులు పూర్తవడంతో గురువారం గృహప్రవేశం చేయడానికి ముహూర్తం పెట్టారు. అయితే... టీఎన్ ఎస్ ఎఫ్ హెచ్చరిక నేపథ్యంలో ఆ సంఘం నేతలను ముందే అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/