Begin typing your search above and press return to search.
కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు తొలిరోజే నిరసన సెగ
By: Tupaki Desk | 24 Nov 2016 11:04 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త క్యాంపు కార్యాలయం ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఆందోళనల సెగ తగిలింది. విద్యార్థుల ఫీజు బకాయిలు - రీయింబర్స్ మెంట్స్ నిధులు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టీఎన్ ఎస్ ఎఫ్ విద్యార్థులు నూతన క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కొత్త క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి తెలుగునాడు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా టీఎన్ ఎస్ ఎఫ్ నేతలు మీడియాతో మాట్లాడుతూ వాస్తు పేరిట వందల కోట్లు దుర్వినియోగం చేస్తూ భవనాలు నిర్మించే సీఎం కేసీఆర్... విద్యార్థుల ఫీజు బకాయిలను మాత్రం విడుదల చేయటం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం తన అధికారిక నివాసాన్ని తొమ్మిదినెలల్లో శరవేగంగా పూర్తి చేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ..రెండున్నరేళ్లుగా పెండింగ్ లో ఉంటున్న బకాయిలపై పెట్టలేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకునేలా బకాయిలు ఉంచడం సరికాదని టీఎన్ ఎస్ ఎఫ్ నేతలు మండిపడ్డారు.
ఇదిలాఉండగా తెలంగాణ సీఎం కొత్త క్యాంపు ఆఫీస్ ప్రారంభమైంది. కొత్త అధికారిక నివాసంలోకి తెల్లవారుజామున 5గంటల 22నిమిషాలకు కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామితో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. కేసీఆర్ దంపతులు వాస్తుపూజ - సుదర్శన యాగం నిర్వహించారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాల సముదాయాన్ని నిర్మించారు. అధికారిక నివాస భవనానికి ప్రగతి భవన్ గా నామకరణం చేశారు. ప్రగతి భవన్ లో సీఎం నివాసం - సమావేశం మందిరం - క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. రకరకాలైన మొక్కలతో సుందరవనంగా ప్రగతి భవన్ ను తీర్చిదిద్దారు. సమావేశాలు జరిపే మందిరానికి జనహితగా నామకరణం చేశారు. జనహిత భవన్ లో రైతులు - కార్మికులు - ఉద్యోగులతో సీఎం సమావేశాలు నిర్మించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఈ నూతన భవన సముదాయాలను నిర్మించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/