Begin typing your search above and press return to search.
జనసేన గూటికి.. 'ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు!!'
By: Tupaki Desk | 4 July 2022 12:21 PM GMTరాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జరుగుతున్నాయ నే చర్చ తెరమీదికి వచ్చింది. చాలా మంది జగన్ అభిమానులమని చెప్పుకొనే నాయకులు కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వరలోనే తమ దారి తాము చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవల హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందోఏమో.. ఇక్కడ మాత్రం ప్రకంపనలు పుట్టాయి. ఇటీవల జరిగిన.. ప్లీనరీలో ఒక ఎమ్మెల్యే.. జగన్‌పైనే నేరుగా విమర్శలు గుప్పించారు. "సీఎం జగన్‌కే అన్ని విషయాల్లోనూ క్రెడిట్ వస్తోంది. ఎమ్మెల్యేలుగా మేం సమాధానం చెప్పలేక పోతున్నాం" అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు అన్ని మీడియా చానెళ్లలోనూహైలెట్ అయ్యాయి. అలానే మరో ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం..సామాజిక వర్గాల వారీగా ప్రయత్నించి విఫలం అయ్యారు.
అంతేకాదు.. ఈ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. తన వర్గం వారితో ధర్నాలు.. నిరసనలు కూడా చేయించారు. అయితే.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. గెలిచిన సీట్లలో గతంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచిన సీట్లు . గతంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు. వైఎస్ ఆర్ ఫొటోలను తగల బెట్టారు. అయినా.. కూడా జగన్ సామాజిక న్యాయం చేయాలని.. వీరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి.. గెలిపిస్తే.. వారిద్దరు ఇప్పుడు పవన్ ను కలుసుకోవడం సంచలనంగా మారింది.
పవన్‌తో టచ్‌లో ఉన్నారని.. అంటే.. వాళ్లు ఎలాంటి వాళ్లు అనేది తెలుసుకోవాలని అంటున్నారు.. ప్రకాశం జిల్లా వైసీపీ కేడర్. అందులోనూ.. వాళ్ల నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులను ఇన్సల్ట్ చేస్తున్నారని, వేరే సామాజిక వర్గం వారు పనులపై వెళ్తే.. మీరు నన్ను చూసి ఓటు వేయలేదు.. జగన్‌ను చూసి వేశారు.. ఆ పనేదో జగన్‌నే అడిగి చేయించుకోండి! అని చెబుతున్నారట. కొందరిపై అయితే.. దుర్భాషలు కూడా ఆడుతున్నారని తెలిసింది.
ఇలా వైసీపీని దెబ్బతీసి.. తన సొంత వర్గానికి పట్టం కట్టి వాళ్లను అన్ని విధాలుగా బాగు పరిచి.. ఆ తర్వాత.. జనసేనకు జంప్ అవ్వాలని.. చూస్తున్నారని పెద్ద ఎత్తున వైసీపీ కేడర్‌లో గుసగుస వినిపిస్తోంది. అందులో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. పార్టీ కోసం.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంట. ఎన్నికలకు ముందు.. చివరి నిముషంలో పార్టీలో చేరి టికెట్లు సంపాయించుకున్నారు. పార్టీ హైకమాండ్.. డబ్బు ఇస్తే.. అవి కూడా పంచకుండా.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో లాలూచీ పడ్డారనే పేరుంది.
ఈ క్రమంలోనే ఇచ్చిన డబ్బులు కూడా ప్రజలకు పంచకుండా.. వ్యవహరించారు. కనీసం కేడర్‌ను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అన్ని విధాలుగా వైసీపీ కేడర్ దెబ్బతినే పరిస్థితి ఉందని, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయంలో హైకమాండ్ ఏం చేస్తుందో అని అంటున్నారు పరిశీలకులు.