Begin typing your search above and press return to search.

అత్త కర్కశం.. కోడలి తలనరికి కవర్ తో పోలీస్ స్టేషన్ కు..

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:30 PM GMT
అత్త కర్కశం.. కోడలి తలనరికి కవర్ తో పోలీస్ స్టేషన్ కు..
X
అత్తా కోడళ్లు అంటేనే పాము-ముంగిసల్లా ఎప్పుడూ కీచులాడుకుంటారు. సాధారణంగానే వారిద్దరికీ పడదు. సఖ్యత ఉండదు. అత్తా అంటే కోడలికి కష్టం.. కోడలిని చూస్తేనే అత్త కస్సుమంటూ తిట్టేస్తుంటుంది. పనుల విషయంలోనూ అత్తా కోడల్లు సాకులు చెప్పుకుంటూ భర్తలకు కంప్లైంట్లు ఇస్తారు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా వేయకున్నా భగ్గుమంటుంది. తాజాగా ఏపీలో కోడలి తీరు నచ్చక ఆమె తల నరికి ఏకంగా కవర్ లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది ఓ అత్త.. కోడలు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆస్తి విషయంలో మెలికలు పెడుతుండడంతో అత్త ఈ దారుణానికి పాల్పడింది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో నివాసం ఉంటోంది సుబమ్మ. ఈమె కోడలు వసుంధరతో కలిసి కొత్తపేట రామాపురంలో ఉంటోంది. కొడుకు ఉన్నంత కాలం కోడలితో అత్త బాగానే మెలిగేది. కొన్ని తగాదాలు కొని తెచ్చుకున్న కొడుకు కొన్నేళ్ల కిందట శ్రీకాళహస్తి పట్టణంలో హత్యకు గురయ్యాడు. దీంతో అత్తా కోడళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి.

మరోవైపు కోడలు యుక్త వయసులో ఉండడం.. భర్త లేకపోవడంతో కోడలు వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అత్త తరచూ కోడలితో గొడవకు దిగేది. కుటుంబానికి చెందిన కొంత పొలంతోపాటు ఇల్లు, ఇతర ఆస్తులు అత్త సుబ్బమ్మ పేరిట ఉన్నాయి. దీంతో ఆస్తిలో తన వాటా కావాలని అత్తతో గొడవపడుతుందేది వసుంధర. ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సుబ్బమ్మ తన అన్న కొడుకుతో మాట్లాడుతుండగా.. కోడలు వసుంధర తన ప్రియుడిని, మరిదిని వెంటపెట్టుకొని వచ్చి అత్తతో గొడవకు దిగింది.

ఇద్దరూ కాసేపు జుట్టు పట్టుకొని గొడవపడ్డారు. అదే సమయంలో కోడలు వసుంధర ఎక్కడ చంపేస్తుందో అని భయపడిన సుబ్బమ్మ.. తన అన్న కొడుకుతో కలిసి కత్తితో కోడలి తల నరికేసింది. అంతేకాదు.. మొండెం నుంచి తలను వేరు చేసి తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

కోడలి తల నరికి రోడ్డుపై వెళుతున్న అత్తను చూసి స్థానికులు హడలిపోయారు. సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.