Begin typing your search above and press return to search.
ఉగ్రదాడి వేళ.. ఆ మంత్రి ఏం చేశారంటే..
By: Tupaki Desk | 23 March 2017 4:43 AM GMTఉగ్రదాడి జరిగి.. చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్న వేళ.. నేతలు ఏం చేస్తారు?వీలైనంతవరకు రక్షణ చట్రంలోకి వెళ్లిపోతారు. బయటకు రావటానికి అస్సలు ఇష్టపడరు. సురక్షిత ప్రదేశాల దిశగా వెళ్లిపోతారు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో.. ఉగ్రదాడి ఘటనా స్థలం నుంచి త్వరగా వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారు. ఇందుకు భిన్నంగా చేసి వార్తల్లోకి ఎక్కారు బ్రిటన్ విదేశాంగ సహాయమంత్రి తోబియాస్ ఎల్ వుడ్.
లండన్ లోని పార్లమెంటు భవనానికి దగ్గర్లో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఉగ్రదాడికి పాల్పడటం..ఇద్దరి ప్రాణాల్నితీయటం..పలువురిని గాయపర్చటం తెలిసిందే. భద్రతాసిబ్బంది ముష్కరుడ్నికాల్చి చంపి.. చుట్టుపక్కల పరిస్థితి గందరగోళంగా ఉన్న వేళలో.. బ్రిటన్ విదేశాంగ సహాయమంత్రి వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉగ్రవాది ఒక పోలీసు అధికారిని పొడుగాటి కత్తితో విచక్షణారహితంగా పొడిచేశాడు.దీంతో..తీవ్రంగా గాయపడిన అతడ్ని రక్షించేందుకు.. మంత్రి ఎల్ వుడ్ క్షతగాత్రుడి నోటిలో నోరు ఉంచి.. శ్వాస అందించే ప్రయత్నం చేయటమే కాదు.. అతడి గాయాలకు రక్తస్రావం జరగకుండా ఉండేలా ప్రయత్నించారు. ఆయన అన్ని ప్రయత్నాలు చేసినా..సదరు అధికారిని రక్షించుకోలేకపోయారు. ఆ అధికారి మరణించారు. గతంలో ఎల్ వుడ్ సోదరుడు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయారు. మంత్రి చేసిన చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు. అదేసమయంలో ఉగ్రదాడిలో పోలీసు అధికారి మరణించటంపై దిగ్భాంత్రిని వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/