Begin typing your search above and press return to search.
నేడే ఇంటర్నేషనల్ యోగా డే' ... యోగా ప్రాముఖ్యత, చరిత్ర !
By: Tupaki Desk | 21 Jun 2021 6:32 AM GMTయావత్ ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా అతి ముఖ్యమైంది. ఓ మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు. భారతదేశంలో వేద కాలం నుంచే యోగ ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము , భారతము, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది.
యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు.
యోగా డే ను జూన్ 21 నే ఎందుకు జరుపుకుంటారు అంటే .. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవడం గురించి ప్రతిపాదన చేయడం, ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించారు. దీంతో 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ఈ రోజు. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.
జూన్ 21,2015న ప్రపంచమంతా తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. భారత్‌లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆ వేడుకలను నిర్వహించగా... 84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు.మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటినుంచి ప్రతీ ఏటా భారత్‌లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎవరి ఇళ్లల్లో వారే యోగా చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. 'క్షేమం కోసం యోగా' అనే థీమ్‌తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ థీమ్ ఇచ్చారు.