Begin typing your search above and press return to search.
ఇవాళ శ్రీరామనవమి.. ఎంతమందికి గుర్తుంది? ఈ ఏడాదంతా ఇంతేనా?
By: Tupaki Desk | 21 April 2021 4:06 AM GMTఏప్రిల్ వచ్చిందంటే చాలు.. ఉగాది ఆ వెంటనే మొదలయ్యే రంజాన్ పవిత్ర మాసం.. ఆ మధ్యలో వచ్చే శ్రీరామనవమి. తెలుగు ప్రజలకు ముఖ్యమైన ఈ పండుగల్లో.. శ్రీరామనవమి అంటే.. ఆ ఉత్సాహమే వేరుగా ఉండేది. ఎండ తీవ్రత పెరిగిన వేళ.. ఊళ్లల్లో నవమి కోసం పెద్ద పెద్ద పందిళ్లు వేయటం.. స్వామివారికి కన్నుల పండువుగా జరిపే కల్యాణాలతో వాతావరణం అంతా సందడిగా ఉండేది. అన్నింటికి మించి.. తెలుగు ప్రజలకు మరో తీపి గురుతు ఏమంటే.. నవమి కల్యాణానికి భద్రాచలం ముస్తాబు కావటం.. ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. స్వామి వారికి పట్టువస్త్రాలు.. ముత్యాల తలంబ్రాలతో వెళ్లటం.. కల్యాణం జరిగేంతవరకు అక్కడే ఉండటం జరిగేది.
ఉమ్మడి రాష్ట్రం కాస్తా.. రెండుగా మారిన తర్వాత నుంచి తెలంగాణ ప్రజలకు భద్రాచలం.. ఏపీ ప్రజలకు ఒంటిమిట్ట కావటం.. రెండింటిలోనూ పూజా విధానాల్లో ఉండే మార్పు.. శ్రీరామనవమిని జరుపుకునే తీరును కాస్తా మార్చిందని చెప్పాలి. గడిచిన ఆరేళ్లలో నవమినాడు జరిగే కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవటం.. అటెన్షన్ కాస్త తగ్గిందని చెప్పాలి. ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే.. ప్రజల్లో మాత్రం శ్రీరామనవమి జోరు తగ్గలేదు.
ఇందుకు భిన్నంగా గత ఏడాది లాక్ డౌన్ నేపథ్యంలో నవమి వేడుకలు ఏ మాత్రం హడావుడి లేకుండా సాగాయి. ప్రజలు ఇళ్లల్లో నుంచి రావటానికే భయపడిన పరిస్థితి. దీనికి తోడు.. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో శ్రీరామనవమి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది. ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ అయిన రంజాన్ పరిస్థితి కూడా అదే తీరులో సాగింది. కట్ చేస్తే.. ఈ రోజు శ్రీరామనవమి.
సెకండ్ వేవ్ ఇస్తున్న షాకులతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో కాకున్నా.. ప్రతి ఇంటికి ఇంటర్ కనెక్టివిటీ ఉండే ఒకట్రెండు ఇళ్లల్లో కరోనాకు సంబంధించిన కేసులు వెలుగు చూడటం.. దాని హడావుడిలో ఉన్న వేళ.. పండుగ అన్నది కూడా గుర్తు లేకుండా పోయిన పరిస్థితి.యావత్ దేశం ఇప్పుడు పాజిటివ్ కేసులు.. ఆసుపత్రుల్లో బెడ్లు.. ఆక్సిజన్ సిలిండర్లు.. అత్యవసర చికిత్సకు వినియోగించే రెమ్ డెసివిర్ లాంటి వాటితోనే నడిచిపోతోంది. ఇలాంటివేళ.. వచ్చిన శ్రీరామ నవమి గుర్తు కూడా రాని పరిస్థితి. సెకండ్ వేవ్ తీవ్రత ఇదే రీతిలో మరికొంత కాలం నడిస్తే.. ఈ ఏడాది పండుగలన్ని ఇదే తీరులో మారతాయని చెప్పక తప్పదు.