Begin typing your search above and press return to search.
నాడు నేడు : వివాదాల్లో శ్రీకాకుళం నేతలు?
By: Tupaki Desk | 10 Feb 2022 7:38 AM GMTశ్రీకాకుళం నాయకులు తరుచూ వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు.టీడీపీ హయాంలోనూ,ఇటు వైసీపీ హయాంలోనూ వివాదాలకు తావిచ్చే నేతలకు అస్సలు ఈ తూరుపు ప్రాంతంలో ఈ చైతన్యం నిండిన ప్రాంతంలో కొదవేలేదు.వివాదాలతోనే పేరు తెచ్చుకోవాలి అన్న తాపత్రయం కూడా కొందరి నేతల్లో ఇటీవల కాలంలో ప్రబలుతోంది.కొందరు నాయకులు పొరుగు తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ ను ఇమిటేట్ చేస్తూ,విద్వేషాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేస్తూ తద్వారా ఇమేజ్ పెంచుకోవాలని,మీడియాలో ఫోకస్ పాయింట్ గా నిలవాలని ఇటీవల కాలంలో పరితపిస్తున్న దాఖలాలే అధికంగా ఉన్నాయి.
ముఖ్యంగా నాడు టీడీపీలో వివాదాలకు తావిచ్చిన నేతలు అచ్చెన్న, కూన రవి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.అధికారులతో మాట్లాడే సందర్భంలో వీళ్లిద్దరూ చాలా దూకుడుగా ఉండేవారన్న టాక్ నడిచింది.ఇందుకు సంబంధించిన వీడియోలు,ఆడియో ఫైళ్లు వెలుగు చూశాయి.ఆ రోజు అచ్చెన్న వ్యవహార శైలి నచ్చక జిల్లా స్థాయి అధికారి ఒకరు లీవ్ పెట్టి మరీ వెళ్లిపోయారు.
తరువాత రాజమండ్రి గైల్ లో జాబ్ వేయించుకున్నారు. ప్రత్యేక అధికారిగా అక్కడ పనిచేసి ఇటీవలే మళ్లీ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం జిల్లా రెవెన్యూ అధికారి హోదాలో ఉన్నారు.ఇక కూన రవి (అప్పట్లో విప్) కూడా అంతే! ఇవాళ మొదటి సారిగా ఎమ్మెల్యే అయి మంత్రి పదవిని సీదిరి అందుకున్న విధంగానే ఆయన్ను కూడా చంద్రబాబు నెత్తినపెట్టుకున్నారు.
ఆ రోజు రాజకీయ దురంధరుడిగా పేరున్న సీతారాంపై పోటీచేసి, ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధం చేసి ఆయా సందర్భాల్లో గెలిచిన వైనంకు చంద్రబాబు కూడా ఫిదా అయ్యారు.ఆ రోజు జరిగిన గొడవల్లో చేయి కూడా విరగొట్టుకున్నారు.
ఆ తరువాత ఆయన్ను విప్ చేశారు.తమ్మినేని అల్లుడే కూన రవి కావడంతో ఆయనలానే ఈయన కూడా స్పీడే! ఇప్పుడు సీతారాం అధికారులతో ఎంతో దురుసుగా ఉన్నారు.ఆ రోజు కూన రవి అదే విధంగా దురుసుగా ఉండేవారు. బీటెక్ చదువుకున్న కూన రవి ఆ స్థాయిలో నడుచుకున్న దాఖలాలే లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆయన అదే దురుసు వైఖరితో పలువురు అధికారులతో ప్రవర్తించిన కారణంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.అరెస్టుల పర్వంలోనూ ఇరుక్కున్నారు.
ఇక వివాదాలలో ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ధర్మాన ప్రసాదరావు ఇంకా ఇంకొందరు ఉన్నారు. ఇప్పుడు సీదిరి అప్పల్రాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు ఇంకా ఇంకొందరు నోటి దురుసు కారణంగా మీడియాలో ఉంటున్నారు.సీదిరి అప్పల్రాజు వైఖరి కారణంగా పలాసలో వైసీపీ పట్టు క్రమంగా పోతోంది అన్న ఆరోపణలు వస్తున్నాయి.