Begin typing your search above and press return to search.
తల్లి కోసం ఓ చిన్నారి ఆవేదన ఇది!
By: Tupaki Desk | 27 Sep 2016 10:08 AM GMTరెండేళ్ల చిన్నారికి అమ్మ తప్ప వేరే ప్రపంచం ఏముంటుంది? అమ్మ నవ్వితే నవ్వుతుంది. అమ్మ పెడితే తింటుంది. అమ్మ లాలిస్తే బొజ్జుంటుంది. అలాంటి ఓ చిన్నారి తన తల్లికోసం పడుతున్న ఆవేదనే ఈ వీడియో క్లిపింగ్. చేయిపట్టుకుని నడిపిస్తున్న ఆ తల్లి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో రెండేళ్ల ఆ చిన్నారికి ఏం చేయాలో తోచలేదు. కిందపడిపోయిన అమ్మను లేపేందుకు ప్రయత్నించింది. ఎంతసేపటికీ తల్లి కదలకపోయేసరికి చేయిపట్టుకుని లాగింది. ఏడుస్తూ అరుస్తూ అమ్మను లేపే ప్రయత్నం చేసింది. కానీ, అమ్మ కదల్లేదు. తన తల్లి కోసం చిన్నారి పడుతున్న తపనను చూసినవారంతా నిశ్చేష్టులైపోయారు. అమ్మకోసం ఆ బిడ్డ పడుతున్నా ఆర్తిని చూసి తల్లడిల్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అమెరికాలోని మెసాచుసెట్స్ లో చోటు చేసుకున్న ఘటన ఇది. లారెన్స్ లోని ఫ్యామిలీ డాలర్ అనే షాపింగ్ మాల్ కి తన రెండేళ్ల బిడ్డతో వచ్చింది 36 ఏళ్ల మహిళ. షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా పడిపోయిందంటే... డ్రగ్స్ ఓవర్ డోస్ అయిందట! అవును, ఆ తల్లికి డ్రగ్స్ అలవాటు. మోతాదుకు మించి సేవించి ఇలా బిడ్డను తీసుకుని దుకాణానికి వచ్చింది. ఓవర్ డోస్ తీసుకోవడంతో మత్తు తలకెక్కేసి కళ్లు తిరిగి షాపింగ్ మాల్ లో కూలబడిపోయింది.
కిందపడిపోయిన తల్లిని లేపేందుకు రెండేళ్ల చిన్నారి చాలా ప్రయత్నించింది. ఆమె అరుపులు విన్న ఓ పోలీస్ వెంటనే దగ్గరకి వచ్చాడు. వెంటనే ఇతర పోలీసుల సాయంతో ఆమెని మహిళల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ శిశు సంరక్షక శాఖ అధికారుల దగ్గర ఉంది. తల్లిని లేపేందుకు బిడ్డ పడ్డ ఆ తపనను ఈ వీడియో లింక్ లో చూడొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/