Begin typing your search above and press return to search.
తాడికొండ టికెట్‌ను కన్ఫర్మ్ చేశారా? టీడీపీలో చర్చ
By: Tupaki Desk | 27 Nov 2022 1:30 PM GMTవచ్చే ఎన్నికలకు సంబంధించి మంచి ఊపుమీదున్న టీడీపీ.. కసరత్తు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలు స్తోంది. తాజాగా వెలుగు చూసిన సమాచారం మేరకు.. గుంటూరులోని కీలకమైన నియోజకవర్గం తాడికొండ కు అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయిన.. తాడికొండలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే, ఎమ్మెల్యే శ్రీదేవిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు.. సొంత పార్టీలోనే అసమ్మతి ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఈ సీటును వచ్చే ఎన్నికల్లో దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యావంతుడైన డాక్టర్ తోకల రాజవర్ధనరావుకు ఖరారు చేసినట్టు టీడీపీలో గుసగుస వినిపిస్తోంది.
ఇప్పటికే ఆయన చంద్రబాబు, నారా లోకేష్‌లతో చర్చలు కూడా చేశారని.. ఖర్చు మొత్తం తానే భరించేందుకు హామీ ఇచ్చారని కూడా చెబుతున్నారు. పైగా స్థానికుడు కావడం, తన సతీమణి కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావడం కలిసి వస్తుందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
రాజవర్ధన రావు తాడికొండ నియోజకవర్గ స్థానికుడు కావడం, ఆయన తల్లి మరియు తండ్రి కూడా ఆ ప్రాంత స్థానికులు కావడం తాడికొండ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామాలలో బంధుత్వం కలిగి ఉండడం ఆయనకు ప్లస్‌గా మారుతుందని తెలుస్తోంది. రాజవర్ధనరావు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అనేక రూపాల్లో సేవలుఅందించి.. ఆ కమ్యూనిటీలో పేరు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
1983 నుండి పార్టీలో ఉండి కూడా తన తండ్రికి గాని తనకు గాని ఏవిధమైన పదవులు ఇవ్వకపోయినా పార్టీకోసం పనిచేసిన విధానం నేపథ్యంలో చంద్రబాబు తాజాగా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపారని సమాచారం. పైగా ఈయనకు రాయపాటి సోదరుల అండదండలు ఉండడం కలిసొచ్చే అంశమని అంటున్నారు. మరి ఎన్నికల సమయానికి ఏమైనా మార్పు జరుగుతుందా? ఏమో.. చూడాలి.