Begin typing your search above and press return to search.
ప్రియురాలి కోరిక తీర్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకే టోకరా..
By: Tupaki Desk | 3 May 2022 9:41 AM GMTప్రేమ మైకంలో కన్నుమిన్నూ కానకుండా వెళతారు.ప్రియురాలి ముద్దూ మురిపాల కోసం లక్షలు తగలేసే వారు ఈ సమాజంలో ఉన్నారు. ప్రేయసి కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటారు కొందరు. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తారు. కానీ వీడు మహా ముదురు.. ప్రియురాలు కోరిందని ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేశారు..ఏకంగా కోటి 80 లక్షలు కాజేసి ప్రియురాలి కోరికలు తీర్చాడు.
విష్ణుమూర్తి అలియాస్ సాగర్ అనే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. అంతేకాదు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. టెక్నికల్ గా ఎక్స్ పర్ట్. ఆ ప్రతిభ ఉపయోగించుకొని మంచి ఉద్యోగంలో చేరేవాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేవాడు కూడా. అలా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల్సినోడు పక్కదారి పట్టాడు. ప్రియురాలి మోజులో ఆమెను బాగా చూసుకోవాలనే కోరికతో బద్దకస్తుడిగా మారాడు. ఈజీ మనీకి అలవాటు పడిపోయి నేరాలకు తెరలేపాడు.
అలా చిన్న నేరాలు చేస్తూ డబ్బు పెద్దగా రాకపోవడంతో ఏకంగా రాజకీయ నాయకుల పై ఫోకస్ పెట్టాడు. ఫోన్ కొట్టుడు.. కోట్లు పట్టుడు అన్నట్టుగా పథకం పన్నాడు.రాజకీయాల్లో కాకలు తీరిన ఎమ్మెల్యేలు, మంత్రులనే టార్గెట్ చేశాడు. కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. సాక్షాత్తూ మంత్రులు, ఎమ్మెల్యేలే వీడి వలలో పడ్డారంటే వీడి మాయ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ద్వారా అతడు మోసాలకు తెరలేపాడు. తాను సీఎం అశోక్ గెహ్లాట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తాడు. నా బ్యాంక్ అకౌంట్ కు వెంటనే రూ.20 లక్షలు పంపండని చెబుతాడు. మీకు అందించే సెక్యూరిటీకి అది చాలా అవసరం అంటాడు. వాట్సాప్ ప్రొఫైల్ గా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫ్యామిలీ ఫొటో పెట్టుకునేవాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కు సాగర్ ఫోన్ కొట్టాడు. మాయ మాటలు చెప్పాడు. ఎమ్మెల్యే యాదవ్ కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. విష్ణు మాయ బయటకు వచ్చింది. తీగ లాగితే డొంక కదిలింది. ఫోన్ కాల్ ఆధారంగా విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన విష్ణుమూర్తిగా తెలుసుకున్నారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో విశాఖ వచ్చిన రాజస్తాన్ పోలీసులు విష్ణును అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు అతడిని రాజస్థాన్ తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో విష్ణు లీలలు బయటకు వచ్చాయి.
వీడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు గుంజాడని తేలింది. ఆ దోచిన సొమ్ముతో ప్రియురాలి కోరికపై ఆమెకు 80 లక్షల ఖరీదైన ఇంటిని కొని విలాసవంతమైన జీవితం గడిపాడని తేలింది. ఏపీలోనూ విష్ణు మోసాలకు పాల్పడ్డాడని తేలింది. 2019లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.కోటి 80 లక్షలు వరకూ వసూలు చేసినట్లు తెలుసుకున్నాడు. దీనిపై శ్రీకాకుళంలో నాలుగు కేసులు వెలుగుచూశాయి.