Begin typing your search above and press return to search.
కరొనా ప్రభావం: ఒలంపిక్స్ జరుగుతాయా.. లేవా
By: Tupaki Desk | 20 Feb 2020 1:30 AM GMTప్రపంచం కొవిడ్-19 (కరోనా) వైరస్ తో వణుకుతోంది. ఈ వైరస్ బారిన చైనా తీవ్రంగా సతమతమవుతుంటే దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇప్పుడు కొవిడ్ ప్రభావం టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్ పై కూడా పడే అవకాశం ఉంది. జులై 24వ తేదీన జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ నిర్వహించనున్నారు. అయితే కొవిడ్ ప్రభావంతో అవి జరుగుతాయో లేవోనని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కొవిడ్ ప్రభావంతో ఇప్పటికిప్పుడే ఒలంపిక్స్ నిర్వహణ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ మైకెల్ ర్యాన్ తెలిపారు. ఒలంపిక్స్ నిర్వహణపై తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. అయితే కొవిడ్ ముప్పును అంచనా వేయడంలో అంతర్జాతీతీయ ఒలపింక్స్ కమిటీకి సహకరిస్తామని ప్రకటించారు. భవిష్యత్ లో వారితో కలిసి పని చేస్తామని తెలిపారు. కొవిడ్ వైరస్ విషయమై అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీతో డబ్ల్యూహెచ్ఓ సంప్రదింపులు చేస్తోంది.
కొవిడ్-19 వైరస్ ధాటికి చైనాలో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే 2 వేల మందికి పైగా ఈ వైరస్ కు బలయ్యారు. సుమారు 74,000 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో జరగాల్సిన క్రీడా కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. అయితే టోక్యో ఒలంపిక్స్ లో చైనా తరఫున పాల్గొనాల్సిన క్రీడాకారురల శిక్షణ కూడా వాయిదా వేశారు. దీంతో ఒలంపిక్స్ లో ఆ దేశ అథ్లెట్లు పాల్గొంటారో లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒలంపిక్స్ లో అమెరికా, చైనా దేశాలకు క్రీడాకారులు సత్తా చాటుతారు. ప్రధాన భాగస్వామ్యం ఉండే చైనా దేశస్తులు పాల్గొనకుంటే ఎలా అని ఒలంపిక్స్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఈ ఒలంపిక్స్ లో దాదాపు 11 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.
అయితే ఇటీవల జపాన్ లోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో దాదాపు 500మందికి కొవిడ్-19 వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ వైరస్ అక్కడి నుంచి జపాన్ లో వ్యాపించిందేమోనని ఆందోళన చెందుతున్నారు. జపాన్ మొత్తం వ్యాపిస్తే టోక్యోలో నిర్వహించాల్సిన ఒలంపిక్స్ వాయిదా వేయడమో.. లేదా రద్దు చేయడమో చేయాలి. ఎందుకంటే ఒలంపిక్స్ లో ప్రపంచంలోని అన్ని దేశాల అథ్లెట్లు హాజరవుతారు. ఆ వైరస్ వారికి సోకితే ప్రపంచమంతా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే వీటిపై కొన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఒలంపిక్స్ నిర్వాహకులు, డబ్ల్యూహెచ్ఓ కూడా ఉంది.