Begin typing your search above and press return to search.
దంగల్ కింగ్ దహియా ,కొరికినా పట్టువదల్లే...సెహ్వాగ్ ఆగ్రహం !
By: Tupaki Desk | 5 Aug 2021 4:52 AM GMTటోక్యో ఒలింపిక్స్ లో భారత స్థార్ రెజ్లర్ రవి దహియా అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల 57 కేజీల కేటగిరీ సెమీస్ లో నాలుగో సీడ్ రవి 'విక్టరీ బై ఫాల్' పద్దతిలో విజయం సాధించి ఫైనల్లో దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్ లో భారత రెజ్లర్ నురిస్లామ్ సనయెవ్ (కజకిస్థాన్) ను ఓడించాడు. దీంతో సుశీల్ కుమార్ తర్వాత టైటిల్ పోరుకు క్వాలిఫై అయిన రెండో భారత రెజ్లర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున పతకం గెలిచి ఐదో రెజ్లర్ గా నిలిచాడు. అయితే రెజ్లర్ రవి కుమార్ దహియాని, ప్రత్యర్థి నురిస్లామ్ సనయొవ్ ఆఖర్లో గట్టిగా కొరికినట్లు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది.
బౌట్ ఫస్ట్ 30 సెకన్లలో రవికి పట్టు దొరక్కపోవడంతో 0-1తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకుని నురిస్లామ్ ను మ్యాట్ మీద పడేసి రెండు పాయింట్లు నెగ్గాడు. ఫలితంగా 2-1 లీడ్‌తో ఫస్ట్ పీరియడ్ ముగించాడు. అయితే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ అయిన నురిస్లామ్ రవిపై అటాకింగ్ దిగాడు. మంచి గ్రిప్ తో రవిని మూడుసార్లు ఫిట్లే (ప్రత్యర్థి కాళ్లను మెలిపెట్టడం)కు గురిచేసి వరుసగా 8 పాయింట్లు సాధించాడు. దాంతో లీడ్ 9-2కు చేరింది. దాదాపుగా ఓటమి ఖాయమే అనుకున్న టైమ్ లో రవిసంచలనం చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన సూపర్ స్టామినా, టెక్నికల్ పవర్స్‌కు తోడు అద్భుతమైన మెంటల్ స్ట్రెంత్ చూపెట్టి చివరి నిమిషంలో అద్భుతం చేస్తూ తనదైన శైలిలో బౌట్ ను ముగించాడు.
కౌంటర్ అటాక్‌తో 7-9కు తగ్గించాడు.కౌంటర్ అటాక్‌తో రెండు నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 7-9కు తగ్గించాడు. చివరిలో నురిస్లామ్ రెండు కాళ్లను బలంగా అదిమి పట్టి పిన్ డౌన్ (కొన్ని సెకన్ల పాటు మ్యాట్‌పై ప్రత్యర్థిని కదలకుండా చేయడమే పిన్ డౌన్) చేసి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సెమీఫైనల్ బౌట్ లో రవి దహియా గాయపడ్డాడు. వరుస విజయాలతో బౌట్ లోకి అడుగుపెట్టిన రవి పుంజుకునే క్రమంలో ప్రత్యర్థి రెజ్లర్ నూర్ ఇస్లాం పంటి గాటుకు గురయ్యాడు. ఉక్కిరిబిక్కిరి చేసే రీతిలో మెలిపెట్టడంతో విడిపించుకునే క్రమంలో నూర్‌ఇస్లాం..రవి భుజాన్ని గాట్లు పడేలా గట్టిగా కొరికాడు. బౌట్ ముగిసిన తర్వాత నొప్పితో బాధపడిన దహియా.. రిఫరీకి ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం రవి గాయం అందోళనకరంగా లేదని సహాయ బృందం పేర్కొంది.
నురిస్లామ్ సనయేవ్ తీరుని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కజకిస్థాన్ ప్లేయర్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యహరించాడని సెహ్వాగ్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. ‘ఇది మరీ దారుణం. కసితీరా కొరికినా రవి దహియా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. కజకిస్థాన్ ప్లేయర్ ప్రవర్తించిన తీరు బాలేదు.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. పంటి గాయాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక రవికి గాయం కాలేదని, పంటిగాట్లు పడ్డ చోట ఐస్ ప్యాక్ పెట్టగా అతని నొప్పి తగ్గిపోయిందని భారత్ సపోర్ట్ స్టాఫ్ మెంబర్లు చెప్పారు. ఫైనల్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక క ఫైనల్లో రష్యాకి చెందిన యుగేవ్ జావుర్ ని రవి కుమార్ దహియా ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకి ఢీకొననున్నాడు.