Begin typing your search above and press return to search.
టోక్యో ఒలింపిక్స్.. ప్రేక్షకులు లేకుండానే..?
By: Tupaki Desk | 27 Jun 2021 2:30 AM GMTమరో నెల రోజుల్లో టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే ఇంకా 27 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచ క్రీడా సంగ్రామంలో పార్టిసిపేట్ చేయడం క్రీడాకారుల లక్ష్యం. కనీసం ఒక్క పతకమైనా గెలుచుకోవాలనేది వారి స్వప్నం. భారత్ లాంటి దేశాలు కూడా ఒకే ఒక్క మెడల్ అంటూ ఆరాటపడుతుంటాయి. ఇంత ప్రఖ్యాతమైన క్రీడలు ఈ సారి ప్రేక్షకులు లేకుండానే సాగుతాయా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, మనుషుల గాలి సోకినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పై ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు టోక్యో మెట్రో పాలిటన్ గవర్నమెంట్ కూడా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, గడిచిన వారంలోనే 11 శాతం పెరిగాయని తెలిపింది. దీంతో.. ప్రేక్షకులు లేకుండానే విశ్వ క్రీడలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ దే ఆధిపత్యం అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి ఒలింపిక్స్ నుంచి బోల్ట్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని మూడేళ్ల క్రితమే ప్రకటించాడు. దీంతో.. బోల్ట్ ప్లేస్ ను ఆక్రమించేది ఎవరా? అనే చర్చ మొదలైంది.
అయితే.. అతని స్థానాన్ని ఎవరు ఫిల్ చేస్తారో బోల్ట్ చెప్పడం విశేషం. అమెరికాకు చెందిన ట్రేవాన్ బ్రోమెల్ కు ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పాడు. అతను కొన్ని సంవత్సరాలుగా చాలా అద్భుతంగా పెర్ఫ్మామెన్స్ ఇస్తున్నాడని చెప్పాడు. గాయాల బారిన పడడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాడని, లేదంటే.. అతను తోపుగాడేనని చెప్పాడు. మరి, ఏం జరుగుతుంది? సరికొత్త విజేత ఎవరు? అన్నది చూడాలి.