Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : 4వ రోజు నిరాశపరిచిన భారత అథ్లెట్లు..హైలెట్స్

By:  Tupaki Desk   |   27 July 2021 4:39 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : 4వ రోజు నిరాశపరిచిన భారత అథ్లెట్లు..హైలెట్స్
X
అయిదో రోజు మిశ్రమ ఫలితాలతో భారత్ ‌తన ఒలింపిక్స్ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో ఒక గెలుపును, ఒక పరాజయాన్ని చవి చూసింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్ ఒక గెలుపును, ఒక పరాజయాన్ని చవి చూసింది. ఈ కేటగిరీలో భారత్ స్టార్ షూటర్ మనుభాకర్/సౌరభ్ చౌదరి జంట రెండో రౌండ్ క్వాలిఫై కాగా.. యశశ్విని సింగ్ డెస్వాల్/అభిషేక్ వర్మ జోడీ విఫలమైంది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్ స్టార్ షూటర్ మనుభాకర్/సౌరభ్ చౌదరి జంట రెండో రౌండ్ ఆరంభమైంది. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిందీ జోడీ. 380 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

హాకీలో ప్రతాపాన్ని చూపిస్తోన్న భారత్. స్పెయిన్‌పై జరుగుతోన్న మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యత. ఫస్ట్ హాఫ్‌లోనే రెండు గోల్స్ సాధించిన హాకీ ప్లేయర్లు. ఓపెన్ ప్లేలో సిమ్రన్‌జీత్, పెనాల్టీ స్ట్రోక్‌లో రూపిందర్ సింగ్ గోల్స్ సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌ మూడో రౌండ్‌ లో ఓడిన భమిడిపాటి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన బెన్ లేన్/సీన్ వెండీ జంట చేతిలో పరాజయం

పురుషుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ మూడో రౌండ్‌లో ఓడిన భారత పెడ్లర్ ఆచంట శరత్ కమల్. చైనాకు చెందిన ఎం ఏ లాంగ్ చేతిలో అతను ఓడిపోయాడు. టేబుల్ టెన్నిస్ పురుషులు, మహిళల విభాగంలో భారత ప్రస్థానం ముగిసింది.