Begin typing your search above and press return to search.
టోల్స్ శాశ్వతం.. తేల్చేసిన కేంద్రమంత్రి!
By: Tupaki Desk | 16 July 2019 5:30 PM GMTజాతీయ రహదారుల్లో, కాస్త అభివృద్ధి చేసిన రోడ్లు- ప్లై ఓవర్ల మీద ఇంకెంత కాలం టోల్స్ వసూలు చేస్తారు? అనే ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ. కేంద్ర రహదారుల అభివృద్ధి శాఖ బాధ్యతలు చూసే నితిన్ గడ్కరీ లోక్ సభలో ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు.
గడ్కరీ చెప్పేది ఏమిటంటే.. రహదారులపై టోల్స్ శాశ్వతం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా జాతీయ రహదారిని ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినప్పుడు కూడా టోల్ గేట్ వసూళ్లు పరిమిత కాలానికి అని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఆ రోడ్లును వేయడానికి అయిన ఖర్చు రాబట్టిన తర్వాత, నిర్వహణకు పెద్దగా ఖర్చు ఉండదు కాబట్టి.. టోల్ వసూలు ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలని కేంద్రమంత్రి తేల్చేశారు.
రోడ్లపై వాహనదారుల నుంచి టోల్స్ ను శాశ్వతంగా వసూలు చేయబోతున్నట్టుగా.. అలా వచ్చిన డబ్బును మరో చోట రోడ్ల అభివృద్ధికే వాడబోతున్నట్టుగా నితిన్ గడ్కారీ చెప్పారు. అందుకే వాహనదారుల నుంచి టోల్స్ ను రద్దు చేసే ఆలోచన లేదని, రోడ్ల అభివృద్ధికి టోల్స్ నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన వనరు అని గడ్కారీ తేల్చి చెప్పారు!