Begin typing your search above and press return to search.
మొబైల్‌లో ఉండాల్సిన మరో నెంబర్.. 12890
By: Tupaki Desk | 5 July 2015 9:39 AM GMTమరికొద్దిరోజుల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద ఎత్తున పన్నెండు రోజుల పాటు సాగే ఈ పుష్కరాల కోసం ఏపీ సర్కారు ఒక టోల్‌ఫ్రీ నెంబరును తెరపైకి తీసుకొచ్చింది.
పుష్కరాలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదులు ఉంటే సదరు నెంబరుకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. ఈ నెంబరు 24 గంటలు పని చేస్తుందని..కాకుంటే.. ఈ నెల 10 తేదీ నుంచి ఇది పని చేయటం మొదలు పెడుతుందని చెబుతున్నారు. ఇక.. టోల్ నెంబరుతో పాటు.. ఒక మొబైల్ యాప్ కూడా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. పుష్కరాలకు సంబంధించిన సమాచారంతో పాటు.. పార్కింగ్ స్థలాలతో పాటు.. రిజర్వేషన్లు.. బుకింగ్ కౌంటర్లు.. పురోహితులకు సంబంధించిన సమాచారంతో పాటు.. అత్యవసర సేవలకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మొబైల్ యాప్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పుష్కరాలకు వెళ్లే వారు.. ఈ టోల్‌ఫ్రీ నెంబరు మొబైల్ ఫోన్‌లో రిజిష్టర్ చేసుకోవటం మంచిది.