Begin typing your search above and press return to search.

పాక్ ప్ర‌ధానితో టాలీవుడ్ న‌టి ప్ర‌త్యేక స‌మావేశం

By:  Tupaki Desk   |   6 Nov 2019 2:33 AM GMT
పాక్ ప్ర‌ధానితో టాలీవుడ్ న‌టి ప్ర‌త్యేక స‌మావేశం
X
ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కుతూ...సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ...సినిమాల్లో పెద్ద‌గా యాక్టివ్‌గా లేని ఓ టాలీవుడ్ న‌టీ అనూహ్య ప‌రిణామంతో మ‌ళ్లీ వార్తల్లో నిలిచారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌ర‌ర ప‌రిణామాల్లో భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉండ‌గా...పాక్ ప్ర‌ధాన‌మంత్రితో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవ్వాల‌ని ఆమెకు ఆహ్వానం అందింది. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్ ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో...స‌ద‌రు న‌టికి ఈ ఆహ్వానం రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న 16వ శతాబ్దం నాటి దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారతీయ సిక్కుయాత్రికులు దర్శించుకునేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య కారిడార్‌ను నిర్మించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కారిడార్ నిర్మాణాన్ని భారత్ చేపట్టగా, తన భూభాగంలో ఆ ప్రాజెక్టును పాక్ పూర్తిచేసింది. గ‌త ఏడాది భార‌త ప్ర‌భుత్వం మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఈ నిర్మాణం జ‌రిగింది. రెండు దేశాల ప్రజల మధ్య ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వానికి, ప్రేమకు కర్దార్‌పూర్ కారిడార్ వారధిగా నిలుస్తుంద‌ని ఆకాంక్షిస్తున్నారు.  


ఈనెల 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానుంది. క‌ర్తార్‌పూర్‌ను దర్శించుకోవడానికి భారత్‌ నుంచి వచ్చే సిక్కు యాత్రికులు పాస్‌పోర్టును కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు క‌ల్పించింది. మ‌రోవైపు ప్రారంభోత్స‌వానికి భారత్‌లోని కొందరు సిక్కు ప్రముఖులను ఆ దేశం ఆహ్వానించింది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ ఒక‌రు ఉన్న‌ట్లు స‌మాచారం. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సం రోజున ముఖ్య అతిథిగా రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నుంచి ఆమెకు ఆహ్వానం అందినట్లు స‌మాచారం. అయితే, దీనికంటే ప్ర‌ధాన అంశం...ఈ కార్యక్రమం తరువాత పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కలవనున్న అతికొద్ది మందిలో స‌ద‌రు న‌టి పేరు ఉండ‌టం. అంత‌గా యాక్టివ్‌గా లేని ఈ న‌టికి ఈ అవ‌కాశం క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం.

కాగా, కర్తార్‌పూర్‌ వచ్చే యాత్రికులు రూ.1400 రుసుమును చెల్లించాల్సిందేనని పాక్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్రారంభోత్స‌వం సందర్భంగా, 12వ తేదీన జయంతి ఉత్సవం సందర్భంగా వచ్చే యాత్రికుల వద్ద 20 డాలర్ల (రూ.1400) రుసుమును వసూలు చేయబోమని ప్రకటించారు. ఈ రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో స్పష్టం చేశారు.