Begin typing your search above and press return to search.
సినిమా వాళ్లంతా వైసీపీలోకే
By: Tupaki Desk | 17 Feb 2019 7:44 AM GMTసినిమా వాళ్లకున్నక్రేజ్ మామూలుగా ఉండదు. ఒక బహిరంగ సభకు సినిమా వాళ్లు వస్తున్నారంటే.. జనం తండోపతండాలుగా వస్తారు. అదీగాక.. సినిమా వాళ్లని అందలం ఎక్కించిన చరిత్ర మనది. అందుకే.. సినిమా వాళ్లు వచ్చి చేరతానంటే.. ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ వేస్తుంది. మొన్నటివరకు ఇలా సినిమా జనాలు ఎక్కువుగా టీడీపీలోనే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో కూడా ట్రెండ్ మారబోతున్న సంకేతాలు ఇప్పటికే సర్వేల ద్వారా వచ్చేసింది. దీంతో.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సినిమా సెలబ్రిటీలు అందరూ.. వైసీపీలో చేరుతున్నారు.
కమెడీయన్ పృధ్వీ ఇప్పటికే వైసీపీలో చేరారు. చేరడమే కాదు.. తన స్థాయికి తగ్గట్లు ప్రచారం కూడా చేశారు. వైసీపీపై విమర్శలు చేసిన పాల్ లాంటి వాళ్లని ఏకిపారేశారు. ఇది చూసి జగన్ కూడా ఇంప్రెస్ అయ్యాడంటే.. పృధ్వీ ఏ రేంజ్‌లో పార్టీ కోసం పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. పృధ్వీ తర్వాత.. కమెడీయన్ కృష్ణుడు, ఒకప్పటి హీరో భానుచందర్ కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు దర్శకరత్న దాసరి తనయుడు దాసరి అరుణ్ కుమార్ కూడా పార్టీలో చేరందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాసరికి, వైఎస్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. దీంతో.. దాసరి అరుణ్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఓ వైపు సినిమా వాళ్లు, మరోవైపు మేడా, అవంతి, ఆమంచి లాంటి బలమైన నేతలతో వైసీపీ రోజురోజుకి బలంగా తయారవుతోంది.