Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కళ్లన్నీ ఆయన వైపు చూస్తున్నాయి
By: Tupaki Desk | 26 May 2018 6:30 AM GMTతెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సినీ ఫాలోయింగ్ ఉన్న పార్టీ తెలుగుదేశమే.. నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొత్తలో చాలామంది తెలుగు నటులు ఆయన వెంట నడిచారు. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. టీడీపీలో మురళీమోహన్ - శివప్రసాద్ లాంటి ఎంపీలు - కొద్ది మంది నాయకులు సినీ పరిశ్రమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. టీడీపీ ట్రైన్ రివర్స్ అవుతోంది. సినీ పరిశ్రమ వైసీపీ వెంట అడుగులు వేస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు సినీ పరిశ్రమకు వైసీపీని దగ్గర చేస్తున్నాయి..
వైఎస్ జగన్ 172వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన జగన్ ను ప్రముఖ నటుడు - దర్శకుడు పోసాని కృష్ణ మురళి కలుసుకున్నారు. జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతు వైసీపీకి ఉంటుందని తెలిపారు. ఇలా ఓ టాప్ నటుడు వచ్చి జగన్ ను కలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నీ మధ్యే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన పోసాని.. ఇప్పుడు వచ్చి ఏకంగా వైసీపీలో చేరడం సంచలనంగా మారింది.
తాజాగా ఒకప్పటి హీరో సుమన్ బెంగళూరులోని వైట్ ఫీల్డ్ నల్ళూరుహల్లిలో తన మిత్రుడు - వ్యాపారవేత్త అయిన కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడారు. తనకు రాజకీయాలంటే ఇష్టమని.. తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారని.. మహానేత వైఎస్ ఆర్ అంటే తనకు చాలా అభిమానమన్నారు. నాకు ఇష్టమైన వ్యక్తులు పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. ఇలా తన మద్దతు వైసీపీకి ఉందని చెప్పకనే చెప్పారు.
ఇక చాలారోజులుగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైసీపీ వైపు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నయి. . మోహన్ బాబుకు వ్యక్తిగతంగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ ఫ్యామిలీతో వియ్యం కూడా అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మోహన్ బాబు చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కానీ, ఎంపీ పదవికి కానీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన వైసీపీ పార్టీవైపు చూస్తున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో టాలీవుడ్ కింగ్ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందంటున్నారు.
ఇలా ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు వైసీపీ వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. 2019 వరకు మరింత మంది వైసీపీలో చేరతారని.. వైసీపీకి సినీ గ్లామర్ తో విజయావకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.