Begin typing your search above and press return to search.

తండ్రి..కొడుకుల్ని ఓ రేంజ్లో 'పిసికిన' టాలీవుడ్‌

By:  Tupaki Desk   |   19 Dec 2017 7:30 AM GMT
తండ్రి..కొడుకుల్ని ఓ రేంజ్లో పిసికిన టాలీవుడ్‌
X
ఓ ఇండ‌స్ట్రీ మొత్తాన్ని క‌లిపి ఇంత పెద్ద మాట అనేస్తారా? అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే..న‌టుల్లో కృష్ణ.. చిరంజీవి.. నాగార్జున‌.. వెంక‌టేశ్‌.. మోహ‌న్ బాబు.. జ‌గ‌ప‌తిబాబు.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. సుమ‌న్‌.. న‌రేశ్‌.. కోట శ్రీ‌నివాస‌రావు.. బ్ర‌హ్మానందం.. ఆర్ నారాయ‌ణ‌మూర్తి.. సోసాని కృష్ణ ముర‌ళి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. న‌టీమ‌ణుల్లో జ‌మున‌.. విజ‌య‌నిర్మ‌ల‌.. జ‌య‌సుధ‌.. ప్ర‌భ‌.. హేమ‌.. ద‌ర్శ‌కుల్లో రాఘ‌వేంద్ర‌రావు.. రాజ‌మౌళి.. హ‌రీశ్ శంక‌ర్‌.. ఎన్‌.. శంక‌ర్‌.. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. బి. న‌ర‌సింగ‌రావు.. నిర్మాత‌ల్లో అల్లుఅర‌వింద్‌.. అశ్వ‌నీద‌త్‌.. సంగీత ద‌ర్శ‌కుల్లో ఆర్పీ ప‌ట్నాయక్.. వందేమాత‌రం శ్రీ‌నివాస్‌.. సినీ ర‌చ‌యిత‌ల్లో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి.. సింగ‌ర్స్ లో.. సునీత మొద‌లుకొని చాలామంది హాజ‌ర‌య్యారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇటీవ‌ల కాలంలో ఇంత భారీ కాంబినేష‌న్లో ఇన్ని శాఖ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌టం చూస్తే.. టాలీవుడ్ దిగి వ‌చ్చింద‌ని చెప్పాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌. రాంచ‌ర‌ణ్ లాంటి త‌ర్వాతి త‌రం న‌టులు త‌ప్పిస్తే.. సీనియ‌ర్లు అంద‌రూ హాజ‌రయ్యారు.

మ‌రింత మంది హాజ‌రైన కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ దిగి వ‌చ్చింద‌ని అన‌క‌.. ఇంకేమైనా అనాలా? మ‌రి.. ఇంత మంది ప్ర‌ముఖులు హాజ‌రైన వారిలో మాట్లాడిన కొంద‌రు తెలుగు భాష గురించి.. తెలుగు భాష‌నుసినిమాల్లో మ‌రింత సంస్కారంగా వాడాల్సిన బాధ్య‌త గురించి మాట్లాడే క‌న్నా.. సీఎం కేసీఆర్ గొప్ప‌త‌నాన్ని.. ఆయ‌న గొప్ప మ‌న‌సును పొగిడేందుకే టైం కేటాయించ‌టం విశేషం.

హాజ‌రైంది ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కోస‌మే అయినా.. కీర్తించేది తెలుగును కాక‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్య‌మంత్రిని.. అది కూడా నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వాధినేత‌ను పొగిడేయ‌టాన్ని ఏమ‌నాలి? ఒకాయ‌న కేసీఆర్ ప్ర‌దాని అయి.. కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేస్తే.. ఇంకొక‌రు తెలంగాణ రాజు అంటూ పొగిడేశారు. ఇక‌.. ఎవ‌రికి వారు.. వారి వారి స్థాయిల్లో కేసీఆర్ గొప్ప‌త‌నాన్ని.. ఆయ‌న ధీర‌త్వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రింత చేసిన త‌ర్వాత‌.. కేసీఆర్‌ను.. ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ ను టాలీవుడ్ పిసికేసింద‌ని చెప్ప‌కుండా ఇంకేమైనా చెప్పాలా? ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే వేళ‌లో.. తెలుగు కీర్తి గురించి స్మ‌రించుకోవ‌టం.. తెలుగు భాషను ప‌రిర‌క్షించుకోవ‌టానికి ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేయాల‌న్న విష‌యాల్ని చెప్ప‌టంతో పాటు.. తెలుగును బ‌తికించుకోవ‌టానికి త‌క్ష‌ణం ఏం చేయాల‌న్న అంశాల్ని కాకుండా వ్య‌క్తుల్ని భ‌జ‌న చేయ‌టం ద్వారా అమ్మ భాష వేదిక‌ను త‌మ అవ‌స‌రాల‌కు వాడుకున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.