Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో రాజధాని బిల్లు.. టాలీవుడ్ హ్యాపీ!
By: Tupaki Desk | 22 Jan 2020 5:26 AM GMTటాలీవుడ్ కు మొదటి నుంచి విశాఖ ఒక కేంద్రంగా కొనసాగుతూ వస్తోంది. చెన్నై నుంచి టాలీవుడ్ తరలి వచ్చాకా హైదరాబాద్ లో సెటిలయినా, విశాఖలో మాత్రం దానికి కొంత ఉనికి కొనసాగుతూ వచ్చింది. ఒక దశలో అనేక సినిమాలు విశాఖలో షూటింగ్ జరుపుకున్నాయి. దీంతో అప్పట్లోనే టాలీవుడ్ జనాలు అక్కడ ఆస్తులు కొనడం ప్రారంభం అయ్యింది. భూములు, ఇళ్లు కొన్న ప్రముఖులు అనేక మంది ఉన్నారు. అలాగే స్టూడియోలు నిర్మించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అవేం నిర్మాణం జరగకపోయినా టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులకు విశాఖలో భూములు అయితే ఉన్నాయి.
ఇప్పుడు అసెంబ్లీలో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. విశాఖకు ఒక రాజధాని హోదా వచ్చినట్టే. ఈ నేపథ్యంలో అక్కడ రియల్ బూమ్ పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రియలెస్టేట్ వ్యాపారుల కన్న విశాఖ మీద పడింది. ఇలాంటి నేపథ్యంలో భారీ ఎత్తున భూములు కలిగి ఉన్న సినిమా వాళ్లు మాత్రం ఫుల్ హ్యాపీతో ఉన్నట్టుగా సమాచారం.
విశాఖకు రాజధాని హోదా అన్నప్పుడే చాలా మంది సినిమా వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా ఆ హోదా దక్కుతూ ఉండటంతో వారు మరింత ఇదైపోతున్నారని సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ జనాలకు హైదరాబాద్ లో మంచి ఆదరణ లభిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ధూం.ధాం.. అన్న కేసీఆర్ ఆ తర్వాత మాత్రం సినిమా వాళ్లతో చాలా సఖ్యతగా ఉన్నాడు. అప్పట్లో ఆంధ్రా సినిమా వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే అన్నట్టుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు టీఆర్ ఎస్ వాళ్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాకా మాత్రం సినిమా వాళ్లతో వారు తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రత్యేకించి కేసీఆర్ చాలా సన్నిహితంగా మారారు. ఇలాంటి నేపథ్యంలో అటు హైదరాబాద్ లో తమకు ఎదురులేకపోవడం, మరోవైపు విశాఖలోనూ పరిణామాలు సానుకూలంగా మారుతూ ఉండటం సినిమా వాళ్లకు కొత్త జోష్ ను ఇస్తూ ఉందని ఆ సర్కిల్స్ ద్వారా తెలుస్తూ ఉంది.