Begin typing your search above and press return to search.
చీటింగ్ కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్ .. అసలేంజరిగిందంటే ?
By: Tupaki Desk | 16 Dec 2019 5:52 AM GMTమోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు ..ఈ మధ్య మోసం చేయడం అందరికి అలవాటుగా మారిపోయింది. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అని ఈ మధ్య ఎక్కువగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మోస పోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందే తప్ప ..తగ్గడం లేదు. తాజాగా ఒక టాలీవుడ్ యువ హీరో .. 11 మందిని చీటింగ్ చేసి పోలీసులకి దొరికిపోయాడు.
పూర్తి వివరాలు చూస్తే .. గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన షేక్ బషీద్ అలియాస్ బాసిత్ 'ఎవడ్రా హీరో' సినిమాలో హీరో గా నటించారు. బీకాం చదివిన బషీద్ మొదట్లో గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆ తరువాత 2008లో హైదరాబాద్ వచ్చి ఎస్ బీ కే గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్ లలో ఫైనాన్స్ సంస్థలను ప్రారంభించాడు. చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడటానికి అలవాటు పడ్డారు. సినీ నిర్మాత గా.., రియల్ ఎస్టేట్ వ్యాపారిగా.. నటుడుగా అందరికీ పరిచయం అయ్యాడు. తనకు తాను పరిచయం చేసుకుంలూ మోసాలు చేయడం ప్రారంభించాడు.
తాజాగా.. హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన పానకాలరావు అనే వ్యక్తి రూ.15 కోట్ల రుణం కావాలని ఆశ్రయించగా.. అతడి నుంచి బషీద్ రూ.65 లక్షలు వసూలు చేశాడు. గుంటూరుకు చెందిన మువ్వా గురవయ్య అనే వ్యక్తి రూ.10 కోట్ల రుణం కావాలని సంప్రదించగా రూ.32.50 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్ బెదిరించాడు. బాధితులిద్దరూ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఈ హీరో పైన ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి అని తెలుస్తోంది.