Begin typing your search above and press return to search.

వైజాగ్ లో క్యాపిట‌ల్..టాలీవుడ్ మ‌ద్ద‌తు ఉన్న‌ట్టే!

By:  Tupaki Desk   |   10 Jan 2020 8:23 AM GMT
వైజాగ్ లో క్యాపిట‌ల్..టాలీవుడ్ మ‌ద్ద‌తు ఉన్న‌ట్టే!
X
ఏపీకి నూత‌న రాజ‌ధానిగా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనే అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. అక్క‌డ సినిమా వాళ్ల హ‌డావుడి ఏమీ లేదు. అమ‌రావ‌తి ప్రాంతంలో కొంత‌మంది సినిమా వాళ్లు ఆస్తులు కొన్న‌ట్టుగా వార్త‌లు అయితే వ‌చ్చాయి. అయితే అది ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే. అది కూడా బ్లాక్ మ‌నీ హోల్డ‌ర్ లు మాత్ర‌మే అమ‌రావ‌తి ప్రాంతంలో ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టుగా గుస‌గుస‌లు వినిపించాయి.

చంద్ర‌బాబు నాయుడు అప్ప‌ట్లో అమ‌రావ‌తి గురించి ఒక రేంజ్ లో హ‌డావుడి చేసినా.. అమ‌రావ‌తి వైపు సినిమా వాళ్లు పెద్ద‌గా చూడ‌లేదు. అక్క‌డ చంద్ర‌బాబు నాయుడు అనుకూలురు కూడా స్టూడియోలు క‌డ‌తాం, సినిమాలు తీస్తామంటూ.. ప్ర‌క‌టించ‌లేదు. హైద‌రాబాద్ మీదే అప్పుడు సినిమా వాళ్ల దృష్టి నిలిచింది. మ‌ద్రాస్ నుంచి వ‌చ్చేశాకా హైద‌రాబాద్ లోనే సెటిలైంది ఫిల్మ్ ఇండ‌స్ట్రీ. హైద‌రాబాద్ సినిమా వాళ్ల‌కు అత్యంత అనుకూల ప్రాంతం అయ్యింది. విభ‌జ‌న జ‌రిగాకా.. ప్ర‌ధానంగా ఆంధ్రా వాళ్లే ఉన్న ఇండ‌స్ట్రీ మొత్తం హైద‌రాబాద్ లో నే సెటిలైంది.

అలా అమ‌రావ‌తితో ఏ మాత్రం సంబంధం లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఇప్పుడు వైజాగ్ విష‌యంలో మాత్రం సానుకూలంగా ఉన్న‌ట్టుగా తెలుస్తూ ఉంది. వైజాగ్ కు మొద‌టి నుంచి ఇండ‌స్ట్రీతో స‌త్సంబంధాలే ఉన్నాయి.

వైజాగ్ లో బోలెడ‌న్ని సినిమాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్నాయి. కొన్ని ద‌శాబ్దాల కింద‌టే వైజాగ్ కేంద్రంగా అనేక సినిమాలు రూపొందాయి. అయితే మ‌ధ్య‌లో అది కాస్త ఆగింది. కానీ అప్ప‌టి నుంచి వైజాగ్ ఏరియాలో సినిమా వాళ్లు కొంద‌రు ఆస్తుల‌ను అయితే కొన్నారు. వైజాగ్ లో ఆస్తుల‌ను క‌లిగి ఉన్న సినిమా వాళ్ల జాబితా బానే ఉంది.

అమ‌రావ‌తితో పోలిస్తే.. వైజాగ్ సినిమా వాళ్ల‌కు అనేక ర‌కాలుగా ఆక‌ర్ష‌ణీయంగా నిలుస్తూ ఉంది. అక్క‌డ వాళ్ల ఆస్తులు ఉండ‌నే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వైజాగ్ కు క్యాపిట‌ల్ సిటీ హోదా ఇవ్వ‌డం ప‌ట్ల సినిమా వాళ్లు సానుకూలంగానే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకే చంద్ర‌బాబు నాయుడి ఆందోళ‌న‌ల‌కు సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి మ‌ద్ద‌తూ ల‌భించ‌డం లేదు. కేవ‌లం నారా రోహిత్ మాత్ర‌మే గ‌ళం విప్పాడు. అత‌డు ఎలాగూ చంద్ర‌బాబు నాయుడి సొంత త‌మ్ముడి కొడుకే కాబ‌ట్టి.. అది పెద్ద స‌పోర్ట్ ఏమీ కాద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. వైజాగ్ కు సినీ ఇండ‌స్ట్రీ మ‌ద్ద‌తు పూర్తిగా ఉన్న‌ట్టే అంటున్నారు.