Begin typing your search above and press return to search.
డ్రగ్స్ షాక్:నిర్మాతే కాదు..ప్రముఖ దర్శకుడు కూడా!
By: Tupaki Desk | 4 July 2017 4:54 AM GMTహైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ మాఫియా బయటకు వచ్చి సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. తొలుత ఈ కేసులో నిందితులు.. బాధితులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. తమ అంచనా తప్పని తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఉదంతాన్ని తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి.
డ్రగ్స్ ఎపిసోడ్ లో మహానగరానికి చెందిన నాలుగు ఇంటర్నేషనల్ స్కూళ్లు.. ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇవ్వటం చూస్తే.. ఇదేదో చిన్న రాకెట్ బయటకు వచ్చిన భావన అస్సలు కలగదు. ఈ కేసు బయటకు వచ్చినప్పుడు డ్రగ్స్ వాడే వారి సంఖ్య కేవలం ఏడుగురికి మించదని అనుకున్నారు. అయితే.. విచారణ లోతు పెరుగుతున్న కొద్దీ.. దందా ఎంత పెద్దదన్న విషయం బయటకు వచ్చి నోట మాట రాకుండా చేస్తోంది.
తాజాగా వెలుగు చూస్తున్న దాని ప్రకారం కేవలం 20 రోజుల వ్యవధిలో 136 మందికి డ్రగ్స్ అందినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వెల్లడించింది.
డ్రగ్స్ గుట్టు రట్టు అయిన వేళలో ఒక బడా నిర్మాత ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించటం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ ను వాడే వారి జాబితాలో ప్రముఖ దర్శకుడు కూడా ఉన్నట్లుగా తేలి.. సంచలనం సృష్టిస్తోంది. తక్కువ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న ఓ దర్శకుడికి.. ఈ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ డ్రగ్స్ అమ్ముతాడని గుర్తించారు. ఏడాదికో సినిమా తీస్తూ తనకంటూ ఒక సినిమా మాత్రమే చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.
సదరు దర్శకుడి ఫోన్ నెంబరు కెల్విన్ కాల్ లిస్ట్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. కెల్విన్ తో నిత్యం టచ్ లో ఉండే నిర్మాత.. మానసిక ఒత్తిడికి గురి అవుతున్న సదరు దర్శకుడికి కూడా డ్రగ్స్ ఇచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. సదరు దర్శకుడు ఎల్ఎస్ డీ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఆయనే డ్రగ్స్ వాడుతున్నారా? మరెవరి కోసమైనా కొనుగోలు చేస్తున్నారా? అన్నది ఇప్పుడు విచారణ అధికారుల మనసుల్ని దోచేస్తోందని చెబుతున్నారు. మరీ.. డ్రగ్స్ కేసును అంతకంతకూ లోతుగా పరిశీలించిన కొద్దీ మరిన్ని సంచలన అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/