Begin typing your search above and press return to search.

కరోనాలో టాప్‌ పది దేశాలు ఇవే..

By:  Tupaki Desk   |   30 March 2020 12:30 AM GMT
కరోనాలో టాప్‌ పది దేశాలు ఇవే..
X
జన్మనిచ్చిన చైనా దేశంలో కరోనా విలయ తాండవం చేసి ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడు ఆ వైరస్‌ చైనాను అధిగమించి ఇప్పుడు అమెరికా - ఇటలీలో తీవ్ర రూపం దాల్చింది. ఆ వైరస్‌ చైనా కన్నా మిగతా దేశాల్లో విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా కేసులతో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. లక్షల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. 185 దేశాల్లో కరోనా వైరస్‌ పాకగా ముఖ్యంగా 15 దేశాల్లో ఈ వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. అన్ని దేశాలు ఈ వైరస్‌ తో ప్రభావితమవుతున్నాయి. ఈ వైరస్‌ పై ముందస్తు స్పందించకపోవడం.. వైరస్‌ వ్యాపిస్తున్నా కట్టడి చర్యలు తీసుకోవడంలో విఫలమవడంతో ఆయా దేశాల్లో ఈ కేసులు తీవ్రమవుతున్నాయి. నియంత్రణ చర్యలు తీసుకున్న దేశాల్లో ఈ వైరస్‌ కొంత నెమ్మదించింది. ఈ సందర్భంగా కరోనా కేసుల్లో టాప్‌ పదిలో ప్రధాన దేశాలు ఉండడం గమనార్హం.

అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా కరోనా కేసుల్లోనే అగ్రభాగాన ఉంది. టాప్‌ 1లో అమెరికా దేశం నిలబడింది. లక్ష 30 వేలు కరోనా కేసులు అమెరికాలో దాటడం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మృతులు 2 వేలకు పైగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు టాప్‌ స్థాయిలో ఉన్న ఇటలీని దాటి అమెరికా ముందుకువచ్చింది.

ముందే మేల్కోకకపోవడం.. నియంత్రణ చర్యలు పటిష్టంగా తీసుకోకపోవడంతో ఇటలీని కరోనా ముంచెత్తింది. అతి వేగంగా కరోనాను బారిన తీవ్రంగా నష్టపోయిన దేశం ఇటలీ. ఈ వైరస్‌ ఇటలీలో తీవ్రంగా వ్యాపించింది. ఇప్పటివరకు 92 వేలకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో పరిణామాలు ఆందోళనకరంగా కొనసాగుతూ ఉన్నాయి.

చైనాలో పుట్టిన కరోనా విలయ తాండవం చేసింది. ఆ వైరస్‌ తీవ్రంగా వ్యాపించి ఎంతోమంది బలయ్యారు. కేసుల సంఖ్య మాత్రం 80 వేలు దాటింది. మృతులు మూడున్నర వేలకు పైగా ఉన్నాయి.

వీటితో పాటు స్పెయిన్ - జర్మనీ - ఫ్రాన్స్‌ లలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపిస్తూ ఉంది. స్పెయిన్‌ లో మరణాలు ఐదు వేలను దాటాయి. జర్మనీలో కేసుల సంఖ్య చాలానే ఉన్నా - మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫ్రాన్స్ - ఇరాన్ - యూకేలు కూడా అనేక రకాల తంటాలు పడుతూ ఉన్నాయి.

దేశం కేసులు మృతులు

అమెరికా (యూఎస్‌ఏ) 1,23,072 2,126
ఇటలీ 92,472 10,023
చైనా 81,394 3,295
స్పెయిన్‌ 72,248 5,690
జర్మనీ 48,582 325
ఫ్రాన్స్‌ 37,575 2,314
ఇరాన్‌ 35,408 2,517
యూకే (లండన్‌) 17,089 1,019
స్విట్జర్లాండ్‌ 13,213 235
నెదర్లాండ్స్‌ 9,672 639