Begin typing your search above and press return to search.

భారత్ లో టాప్ 10 సంపన్నులు.. వారి ఆస్తులు లెక్క ఇదే

By:  Tupaki Desk   |   22 Sep 2022 4:36 AM GMT
భారత్ లో టాప్ 10 సంపన్నులు.. వారి ఆస్తులు లెక్క ఇదే
X
భారత్ దూసుకెళుతోంది. ఇక్కడ సంపద అంతకంతకూ పెరుగుతోంది. అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని దూసుకెళుతున్న పారిశ్రామికవేత్తల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చూస్తుండగానే రాకెట్ స్పీడ్ లో గౌతమ్ అదానీ భారీగా సంపదను పోగేస్తూ.. ప్రపంచంలోనే టాప్ 2 సంపన్నుడిగా రికార్డు స్థాయికి చేరుకోవటం తెలిసిందే. ఇతగాడి ఆస్తి కేవలం ఏడాదిలో రూ.5.89 లక్షల కోట్లకు పెరగటం విశేషం.

ఐదేళ్ల వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 1440 శాతం పెరిగినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత కుబేరుల సంఖ్య పెరగటమే కాదు.. వారి ఆస్తులు కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి.

తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్టు 2022 ప్రకారం దేశీయంగా టాప్ లో నిలవటమే కాదు.. ప్రపంచ వ్యప్తంగా కూడా రెండోస్థానానికి ఎదిగిన గౌతమ్ అదానీ ఆస్తుల పెంపు వేగం అంచనాలకు మించి ఉండటం విశేషం. ఏడాది వ్యవధిలో ఆయన సంపద 116 శాతం పెరగటం గమనార్హం. దీన్నే రూపాయిల్లో చెప్పాలంటే రూ.5.89 లక్షల కోట్లుగా తేల్చారు.

అదానీ సాధించిన మరో ఘన విజయం ఏమంటే.. రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న 7 కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఇప్పుడున్న ఆస్తుల లెక్కలన్నీ కూడా ఉక్రెయిన్ యుద్ధం లాంటి ప్రతికూలతను ఎదుర్కొంటూ కూడా దూసుకెళ్లటం చూస్తే.. భారత కుబేరుల జోరుకు తిరుగులేదన్న మాట చెప్పక తప్పదు.

గౌతమ్ అదానీ తర్వాత రెండోస్థానంలో నిలిచారు ముకేశ్ అంబానీ. ఆయన ఆస్తి మొత్తం రూ.7.95 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న దేశీయులు తాజా జాబితాలో 1103 మంది చేరగా.. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 62 శాతం పెరిగింది.

భారత్ లో టాప్ 10 కుబేరులు.. వారి ఆస్తుల లెక్క చూస్తే
పేరు సంపద (రూ.కోట్లల్లో)
గౌతమ్ అదానీ.. ఫ్యామిలీ 10.94 లక్షలు
ముకేశ్ అంబానీ.. ఫ్యామిలీ 7.94 లక్షలు
సైరస్ పూనావాలా, ఫ్యామిలీ 2.05 లక్షలు
శివనాడార్.. ఫ్యామిలీ 1.85 లక్షలు
రాధాకిషన్ దమానీ.. ఫ్యామిలీ 1.75 లక్షలు
వినోద్ శాంతిలాల్ అదానీ.. ఫ్యామిలీ 1.69 లక్షలు
ఎస్ పీ హిందుజా..ఫ్యామిలీ 1.65 లక్షలు
ఎల్ఎన్ మిత్తల్.. ఫ్యామిలీ 1.51 లక్షలు
దిలీప్ సంఘ్వి 1.33 లక్షలు
ఉదయ్ కోటక్ 1.19 లక్షలు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.