Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల ఆస్తి ఉన్న తోపులు వీరే బాస్

By:  Tupaki Desk   |   7 Oct 2021 4:23 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల ఆస్తి ఉన్న తోపులు వీరే బాస్
X
సంపన్నులకు సంబంధించిన జాబితాలను తరచూ విడుదల చేయటం తెలిసిందే. ఎన్నిసార్లు చదివినా.. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలన్న తపన ఈ జాబితా సొంతం.

ఒకప్పుడు సంపన్నుల జాబితాలో తెలుగు వారు ఒకరిద్దరు కనిపిస్తే విపరీతమైన సంతోషానికి గురైన పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడు భారీగా సంపదను క్రియేట్ చేస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా–2021 స్పష్టం చేసింది.

ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 69 మంది చోటు సంపాదిస్తే.. వీరి మొత్తం సంపాదనను కలిపితే ర.3.79లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 54 శాతం వృద్ధి కనిపించగా.. కొత్తగా 13 మంది జాబితాలో చేరారు. మొత్తం 69 మందిలో ఇద్దరు మాత్రమేమహిళలు ఉండటం గమనార్హం. అదే సమయంలో మొత్తం 69 మంది సంపన్నుల్లో ఔషధ రంగానికి చెందిన వారే 21 మంది ఉండటం విశేషం. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కు మించి సంపద ఉన్న వారిని పరిగణలోకి తీసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నుల్ని చూస్తే..

ర్యాంక్ పేరు సంపద(రూ.కోట్లల్లో) కంపెనీ

01 మురళి దివి 79,00 దివీస్ ల్యబొరేటరీస్
02 పార్థసారధిరెడ్డి 26,100 హెటెరో ల్యాబ్స్
03 పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డి 23,400 మేఘా ఇంజనీరింగ్
04 సతీష్ రెడ్డి 12,300 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ
05 అమరేందర్ రెడ్డి 12,000 జీఏఆర్
06 సత్యానారాయణరెడ్డి 11,500 ఎంఎస్ఎన్ ల్యాబ్స్
07 జీవీ ప్రసాద్ 10,300 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
08 వెంకటేశ్వర్లు జాస్తి 9,700 సువెన్ ఫార్మా
09 పీవీఎన్ రాజు 9,300 గ్లాండ్ ఫార్మా
10 వీసీ నన్నపనేని 9100 నాట్కో ఫార్మా