Begin typing your search above and press return to search.

గత ఏడాదిలో భారత్ లో అత్యధిక లాభాలు సాధించిన టాప్ 5 కంపెనీలివే

By:  Tupaki Desk   |   30 May 2022 10:30 AM GMT
గత ఏడాదిలో భారత్ లో అత్యధిక లాభాలు సాధించిన టాప్ 5 కంపెనీలివే
X
కంపెనీలు ఎన్నో ఉండొచ్చు. కానీ.. అద్భుతమైన పని తీరును ప్రదర్శించేవి కొన్నే ఉంటాయి. వాటిల్లోనూ భారీ ఎత్తున లాభాలు సాధించే కంపెనీలు మరింత తక్కువగా ఉంటాయి. కంపెనీ ప్రొఫైల్.. నిర్వాహణ.. అమ్మకాలు.. ఇలా అన్ని అంశాలు బాగానే ఉన్నా.. సదరు సంస్థ మాత్రం లాభాల విషయంలో మాత్రం పెద్దగా ఉండని పరిస్థితి ఉంటుంది.

అందుకు భిన్నంగా కొన్ని కంపెనీలు మాత్రం మెరుపులు మెరిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఐదు కంపెనీలు ఆకోవలోకి చెందినవే.

దేశీయంగా ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు సాధించిన కంపెనీలను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. టాప్ 5 కంపెనీల్లో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం.. మిగిలిన మూడు ప్రైవేటు కంపెనీలు ఉండటం కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అత్యుద్భుత ప్రదర్శన చాలా అరుదుగా ఉంటుంది.

టాప్ 5లో రెండు కంపెనీలు ఉండటం.. అందులో ఒక సంస్థ అయితే టాప్ 2లో ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. అలా టాప్ 2 కంపెనీగా నిలిచింది ఓన్ జీసీ. రికార్డు స్థాయి లాభాలతో ఆ కంపెనీ దూసుకెళుతోంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ ఏకంగా 258 శాతం లాభాల్ని ఆర్జించటం గమనార్హం.

దీంతో.. దేశీయంగా లాభాలు సాధించే నెంబర్ వన్ రిలయన్స్ తర్వాత ఓఎన్ జీసీ సంస్థ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ సాధించిన లాభం ఎంతో తెలుసా? రూ.11,246.44 కోట్లు. ఇంత భారీ లాభాలకు కారణం కంపెనీ ఉత్పత్తి చేసే ప్రతి బారెల్ చమురుమీద సగటున 76.62 డాలర్లను పొందటమే.

గత ఏడాది ఇది 42.78 ఉంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బారెల్ ముడిచమురు ధర 14 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవటంతో ఓన్ జీసీకి అత్యుత్తమ ధర లభించింది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో అత్యధిక లాభాలు సాధించిన టాప్ 5 కంపెనీలు.. అవి సాధించిన లాభాల్ని చూస్తే..

ర్యాంకు సంస్థ నికర లాభం (కోట్లల్లో)
1 రిలయన్స్ 67,8454
2 ఓఎన్ జీసీ 49,294
3 టాటా స్టీల్ 41749
4 టీసీఎస్ 38449
5 ఎస్ బీఐ 31676