Begin typing your search above and press return to search.
ఆ రాత్రి ఆ అగ్రహీరో పెళ్లాం అలా చేశారట
By: Tupaki Desk | 8 Dec 2016 8:13 AM GMTనెల రోజుల క్రితం ఇదే రోజున దేశ చరిత్రలో జాతి యావత్ కాసేపు షాక్ తో నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది. అదేంటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో? ఇంత పెద్ద దేశంలో ఏం జరిగినా.. దాని ప్రభావం కొంత భాగమో.. మరికాస్త ఎక్కువ భాగమో ఉంటుందే తప్పించి.. పూర్తిగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి.కానీ.. ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం మాత్రం దేశ వ్యాప్తంగా ప్రజల్ని కొద్దిసేపు నోట మాట రాకుండా చేసింది.
గత నెల 8వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య వెలువడిన ఈ నిర్ణయం వెంటనే.. హైదరాబాద్ లో ఏం జరిగిందన్న విషయంపై ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాదాపు నెల రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమేకాదు.. విచారణ అధికారులు దృష్టి సారించే అవకాశాన్ని ఇచ్చిందన్న మాట వినిపిస్తోంది.
పెద్దనోట్ల నిర్ణయం వెలువడిన వెంటనే.. చాలామంది నల్లకుబేరులు బంగారు దుకాణాలకు ఫోన్లు చేసి.. తాము షాపింగ్ కు వస్తున్నామని.. షాపుల్ని తెరిచి ఉంచాలని చెప్పి మరీ వచ్చి.. కంటికి కనిపించిన ప్రతి వస్తువునుకొనేశారని చెబుతున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ మహానగరంలోని ఐదు జ్యూయలరీ షాపుల్లో 24 గంటల వ్యవధిలో ఏకంగా రూ.470 కోట్ల అమ్మకాలు సాగినట్లుగా తెలుస్తోంది.
ఒక ప్రముఖ హీరో సతీమణితో పాటు.. ఒక మీడియా అధిపతి.. కొందరు పారిశ్రామికవేత్తలు.. వ్యాపార వేత్తలు ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గంటల వ్యవధిలో భారీగా బంగారాన్ని కొనుగోలు చేసినా బిల్లుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఏ బిల్లును కూడా రూ.2లక్షలకు మించి చేయలేదని తెలుస్తోంది.
ఇక.. ప్రముఖ హీరో సతీమణి అయితే.. గంటల వ్యవధిలోనే కొన్ని కోట్ల రూపాయిల బంగారాన్ని కొనుగోలు చేసిన విషయం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. యూత్ లో మంచి పేరు ప్రఖ్యాతులున్న సదరు హీరో సతీమణి.. భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయటం ద్వారా.. తమ వద్దనున్న పెద్దనోట్లను వదిలించుకున్నట్లుగా చెబుతున్నారు.
తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేస్తే.. ఆదాయపన్ను అధికారుల నుంచి ఇబ్బంది అవుతుందని భావించిన వారు.. ఈ రకంగా బంగారంతో మార్చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా.. భారీ తలకాయలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయటం మొదలు పెట్టేసరికి.. షాపుల్లో ఉన్న బంగారం మొత్తం అయిపోయిందని.. వెనువెంటనే నగరంలోని తమకు చెందిన ఇతర షాపుల నుంచి బంగారాన్నితీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
మామూలుగా అయితే రాత్రి 10 గంటలకే తలుపులు మూసేసే బంగారం షాపులు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన రోజు రాత్రి 12 గంటల వరకూ షాపుల్ని తెరిచే ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు సీసీకెమేరా పుటేజ్ ని.. ప్రముఖ బంగారు దుకాణాలకు వచ్చిన ఫోన్ కాల్స్ ను.. వారి డేటాను తనిఖీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని పెద్దనోట్లను రద్దు చేసిన మూడో రోజున.. నగరానికి చెందిన ఐదు బంగారు దుకాణాల వారు బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం ఏకంగా రూ.470కోట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరం మొత్తంగా గత నెల ఎనిమిదో తేదీని భారీగా లావాదేవీలు (అవి ఏ రూపంలో అయినా సరే) జరిపిన చిట్టా మొత్తం బయటకు తీస్తే.. మరెన్ని సంచలనాలు బయటకు వస్తాయో..?