Begin typing your search above and press return to search.
లష్కరే ఉగ్రవాది అబు హతం
By: Tupaki Desk | 1 Aug 2017 9:12 AM GMTజమ్ముకశ్మీర్ లో మరో కీలక ఉగ్రవాది హతం అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది అబు దుజానాను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని హక్రీపురాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అబు హతమయ్యాడు. హక్రీపురాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు బలగాలకు సమాచారం అందించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో టెర్రరిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. అబుతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చంపేశాయి. అయితే ఆ ఇంట్లో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. బలగాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఇదిలాఉండగా...కాశ్మీర్ లో ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారన్న అభియోగంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీ తనయుడు నసీం గిలానీని విచారణకు పిలిచింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని విచారించడం మంచిదే గాని కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఉన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలు చేపట్టడం విచారకరమని నసీం ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం అందరినీ ఒకేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయకూడదని నసీం గిలానీ విమర్శించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో విలాసవంతమైన నివాసాన్ని గిలానీ కలిగి ఉన్నాడని కొన్ని సంవత్సరాల కిందట ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావాల్సిన నసీం గిలానీ ఛాతీనొప్పితో స్కిమ్స్ ఆసుపత్రి ఐసియులో చేరడం కొసమెరుపు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఎ) జమ్మూలో వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ అనుచరుడికి చెందిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గిలానీతో అత్యంత సన్నిహితుడైన న్యాయవాది ఇంటితోపాటు కార్యాలయంలో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారని, త్వరలో ఆయనను ప్రశ్నించబోతోందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఎ జమ్మూలో సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి. ఈ కేసులో గిలానీ రెండో కుమారుడు నసీమ్‌ను ప్రశ్నించనుంది. తెహ్రిక్ ఎ హురియత్ పేరుతో వేర్పాటువాద గ్రూపును నడుపుతున్న ససీమ్‌ను బుధవారం హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఎన్‌ఐఎ సమన్లు జారీ చేసింది.