Begin typing your search above and press return to search.

విడ్డూరం: హాల్ టికెట్ మీద టాప్ లెస్ ఫొటో

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:29 AM GMT
విడ్డూరం: హాల్ టికెట్ మీద టాప్ లెస్ ఫొటో
X
ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్లకు టాప్ ర్యాంకులు కట్టబెట్టిన ఘనత బీహార్ విద్యా శాఖదే. ఆ మధ్య బయటపడ్డ ఈ ర్యాంకుల కుంభకోణం ఎంత పెద్ద దుమారం రేపిందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు బీహార్ కే చెందిన అధికారులు మరో నిర్వాకంతో వార్తల్లోకి వచ్చింది. ఒక విద్యార్థిని హాల్ టికెట్ మీద ఆ అమ్మాయి ఫొటో స్థానంలో ఒక హీరోయిన్ టాప్ లెస్ ఫొటోను ముద్రించి.. హాల్ టికెట్ జారీ చేసి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు బీహార్ అధికారులు. ప్రముఖ హిందీ పత్రిక ప్రభాత్ కబర్ లో ఈ విషయమై వచ్చిన కథనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్సీ) ఈ నెల 8న ఓ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు జారీ చేసింది. నలంద జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి ఈ హాల్ టికెట్ అందింది. హాల్ టికెట్లో తన ఫొటో స్థానంలో ఉన్న చిత్రం చూసి ఆ విద్యార్థినికి దిమ్మదిరిగిపోయింది. అక్కడ ఓ హీరోయిన్ టాప్ లెస్ ఫొటో దర్శనమిచ్చింది. ఇదేంటని అధికారుల్ని అడిగితే స్పందన లేదు. ఆ అమ్మాయి ఆ హాల్ టికెట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. మీడియా కూడా దీని గురించి వార్తలు ప్రచురించడంతో బీహార్ విద్యా శాఖ అధికారుల పరువు పోయింది. ఓటర్ల లిస్టులో.. ఆధార్ కార్డుల జాబితాలో సెలబ్రెటీల ఫొటోలు పొరబాటుగా రావడం చూస్తుంటాం కానీ.. ఇలా పరీక్ష హాల్ టికెట్ మీద హీరోయిన్ టాప్ లెస్ ఫొటో ప్రచురితమవడం మాత్రం ఇంతకుముందెన్నడూ వినని.. చూడని విడ్డూరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/