Begin typing your search above and press return to search.
Top News: ఈరోజు ముఖ్యాంశాలు..
By: Tupaki Desk | 9 Jan 2019 11:19 AM GMT* చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలోని బహుదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర స్తూపం (పైలాన్)ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగం సభలో ప్రసంగించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నానని.. 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది మీరేనంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు.
*బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ మూవీ ఈరోజు రిలీజ్ పాజిటవ్ టాక్ తో దూసుకెళ్తోంది.
*మెగా బ్రదర్ నాగబాబు హీరో బాలక్రిష్ణపై దాడి కొనసాగించాడు. తాజాగా ‘ఎర్రోడి వీరగాథ’ పేరు షార్ట్ ఫిలిం తీసి బాలయ్య వైఖరిని అందులో ఎండగట్టడం సంచలనంగా మారింది.
*ఎన్టీఆర్ బయోపిక్ చూసేందుకు తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు పోటెత్తారు.
*వాట్సాప్ ఫింగర్ ప్రింట్ అంథెటేషన్ తో మరో సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకువస్తోంది.
*రిజర్వేషన్ కలిగిన గ్రామాల్లో కొందరు బడా బాబులు వేలం పాటలకు దిగుతున్నారు. తాము గ్రామానికి ఇంత ఇస్తాం తమనే ఎన్నుకోవాలంటూ బేరం పెడుతున్నారు.
* ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు విషయమై చంద్రబాబు చర్చలు జరిపారు.
*అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుపై హీరో నిఖిల్ తన స్పందనను ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బేషుగ్గా ఉందని కితాబిచ్చారు.
*ఏలేరు కుంభకోణం టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడింది. ఎప్పుడో 1996లో అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఏలేరు భూముల పరిహారం కుంభకోణంలో ఫిర్యాదు ఆధారంగా తాజాగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
*ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎవరెవరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలనేది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చించారు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడిన నాయకులకు పదవుల భర్తీలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం.
*ఎస్సీ - ఎస్టీ రిజర్వేషన్లకు గండికొట్టేలా అగ్రవర్ణాల బిల్లు ఉంటే ఎదిరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
*అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోడీ షోలాపూర్ సభలో విమర్శించారు.
*ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య గత చిత్రం ‘గౌతమి పుత్ర’ రికార్డులను బ్రేక్ చేసి తొలిరోజు రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.
*అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ల బిల్లులో ఎవరు అర్హులో తాజాగా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
*యువతకు దీపికా పదుకొనే సందేశమిచ్చింది. ప్రేమిస్తే యువత పెళ్లి చేసుకోవాలని సూచించింది.
*రాజ్యసభలో అగ్రవార్ణాల్లో పేదల బిల్లుపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఉపాధి కల్పన తర్వాతే బిల్లు పెట్టాలని స్పష్టం చేసింది.
*తాజాగా కొడంగల్ లో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి అనుచరుడైన విశ్వనాథ్ నిటూరు గ్రామం నుంచి కాంగ్రెస్ తరుఫున సర్పంచ్ పదవికి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు.ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
*కాంగ్రెస్ లో అసమ్మతిపై అధిష్టానం కన్నెర్ర జేసింది. విమర్శలు చేస్తే వేటేనని కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు పంపింది.
* ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థపై తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసింది. హెరిటేజ్ సంస్థ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తోందని.. రోగాలు వ్యాపించేందుకు దోహదపడుతోందని ఫిర్యాదులో పేర్కొంది..
*5మినిట్స్ ఆర్ అంటూ కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కోహ్లీ, సైనా, దీపికా కు ట్విట్టర్ లో కొత్త చాలెంజ్ విసిరారు. పాత క్రీడలు ఆడాలని సూచించారు.
*ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తోంది.
*జగిత్యాల జిల్లాలో కోటి విలువైన సెల్ ఫోన్లను జగిత్యాల పట్టణంలో ఈ ఉదయం దొంగలు ఓ సెల్ ఫోన్ దుకాణం లోంచి చాకచక్యంగా కొట్టేశారు.
*బాలీవుడ్ చిత్రాలను చూసేందుకు హిందీ నేర్చుకుంటున్న అమెరికన్ల సంఖ్య భారీగా పెరుగుతోందని అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది.
*ప్రపంచబ్యాంకు భారత వృద్ధి రేటు ఈ ఏడాది 7.3శాతంగా పేర్కొంది.
*శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ అధినేత జగన్ ను కలిసి సినీ నటుడు భానుచందర్ వైసీపీ పార్టీలో చేరారు.
కండువా కప్పి జగన్ చేర్చుకున్నారు.
* భారత సంతతి అమెరికన్ పోలీసు రోనిల్ సింగ్ వీరోచిత పోరాటం.. మరణంపై మరణంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘నేషనల్ హీరో’ అంటూ పొగిడారు.
*2018లో టిమ్ కుక్ జీతం భారీగా పెరిగింది. 110 కోట్లకు పైగానే కుక్ జీతం అందుకున్నారు. అందులో బోనస్ గా రూ.84 కోట్లు ఉంది.