Begin typing your search above and press return to search.

Top News: ఈరోజు ముఖ్యాంశాలు

By:  Tupaki Desk   |   23 Jan 2019 11:30 AM GMT
Top News: ఈరోజు ముఖ్యాంశాలు
X
1. టీడీపీ - జనసేన కలిస్తే తప్పేంటని తాజాగా టీడీపీ రాజ్యసబ ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొనడం సంచలనమైంది. అటు సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ను ఏమనవద్దు’ అంటూ టీడీపీ నేతలకు ఆదేశాలివ్వడంతో టీడీపీ-జనసేన పొత్తుకు మరో బీజం పడినట్టు కనిపిస్తోంది.

2. వైసీపీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) బుధవారం చార్జిషీట్ లో దాఖలు చేసింది.

3. మంత్రి జవహర్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.

4. పవన్ ను కలుపుకుంటామన్న టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత ఇష్టాలు వేరు.. పార్టీ విధానాలు వేరని స్పష్టం చేశారు.

5. రెండేళ్లు గడిచినా విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని ప్రముఖ సీని నటుడు - శ్రీవిద్యానికేతన్ అధినేత డాక్టర్ మంచు మోహన్ బాబు దుయ్యబట్టారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

6. లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ చరిష్మా ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నారు. ప్రియాంకకు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు. ఇక యూపీ జనరల్ సెక్రెటరీగా ఉన్న గులాం నబీ ఆజాద్ ను హర్యానా జనరల్ సెక్రటరీగా హైకమాండ్ నియమించింది.

7. టీడీపీ-జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న టీడీపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీజీతోపాటు ముఖ్యమంత్రి మీద పవన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే కిడారి - సోము హత్యకు చంద్రబాబే కారణమని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

8. ఇన్నాళ్లు బాలయ్యను టార్గెట్ చేసి సెటైర్లు వేసిన మెగా బ్రదర్ నాగబాబు ఈసారి తాజాగా లోకేష్ భాష పటిమపై తన యూట్యూబ్ చానల్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించడం హాట్ టాపిక్ గా మారింది.

9. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లను తొలగించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఓటర్స్ డేను బహిష్కరిస్తున్నామని.. ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ఆహ్వానానికి కాంగ్రెస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

10. హీరో - దర్శకుడు లారెన్స్ బాలీవుడ్ హీరో అక్షయ్ తో సినిమా చేస్తున్నాడు. కాంచన సినిమాలను బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నాడు.

11. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణాపాయం తప్పింది.

12. పాండ్యా - కేఎల్ రాహుల్ లు నా షోకు వచ్చి చిక్కుల్లో పడ్డారు. దీనికి తాను చింతిస్తున్నానని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

13. ఆస్టేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా న్యూజిల్యాండ్ పర్యటనలోనూ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించింది.

14. అగ్రవర్ణాలకు 10శాతం కోటాపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ యూనివర్సిటీలో మొదట ఈబీసీ కోటాలో 16వేల సీట్లను పెంచారు.

15. గృహ అవసరాలకు కరెంట్ వాడినందుకు గాను రూ.23 కోట్ల బిల్లూ యూపీ కనౌజ్ కు చెందిన అబ్దుల్ బాసిత్ కు వచ్చింది. అధికారుల తప్పిదం వల్ల బాధితుడు బోరుమంటున్నాడు.

16 దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల దురుసుగా ప్రవర్తించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ చిక్కుల్లో పడ్డారు.

17. విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు చంద్రబాబు కేటాయించారని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రకటించారు.

18.ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

19. శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు ఇంట్లో మాత్రం కష్టాలనెదుర్కొంటున్నారు. వీరిలో కనదుర్గ అనే మహిళను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారని ఇదివరకే ఆమె అత్తతో పాటు భర్త కనకదుర్గను చితకబాదారు. తాజాగా ఆమె భర్త ఇల్లుకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లాడు. దీంతో ఆమె ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మై హోంలో తలదాచుకుంటోంది.

20. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ వివాహం ఫిబ్రవరి 11న జరగనుంది. వ్యాపారవేత్త , విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనుంది.

21. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. అన్ లోకేషన్ స్టిల్స్ ను రిలీజ్ చేశాడు.

22. తనపై సయ్య సుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కుట్ర అని మండిపడ్డారు.

23. ట్విట్టర్ లో మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బేటి బచావో అంటూ నరేంద్రమోడీ ఫొటోతో ఇస్తున్న ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇందులో ప్రచారం కోసం మాత్రమే మోడీ కోట్లు ఖర్చు చేస్తున్నాడని.. ఖర్చు బారెడు.. ఫలితం మూరెడు అన్నట్టు ఉందని ట్వీట్ లో ఎద్దేవా చేశారు.

24. కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేని ఓ ఆరు మార్గాల్లో తమ వ్యయాన్ని దాచిపెడుతున్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. ఈ నెలారంభంలో పార్లమెంట్ కు సమర్పించిన ఓ నివేదికలో చాలా ప్రభుత్వ రాయితీల ఖర్చుపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్ లో చాలా చాలా తక్కువ చేసి చెబుతున్నట్లు వెల్లడించింది.

25. హైకోర్టు కోసం తాత్కాలిక భవనం ఏర్పాటు చేసినా కూడా చాలా న్యాయ సంస్థలు ఇంకా అమరావతికి తరలిరాలేదు. దీంతో.. వీటికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఢిల్లీ చాలా బిజీగా ఉన్నారు చంద్రబాబు. మంగళవారం న్యాయమూర్తులతో ప్రత్యేకంగా భేటీలు నిర్వహించారు. అలాగే జస్టిస్ రమణతో దాదాపు గంటన్నర పాటు సమావేశం అయినట్టుగా సమాచారం.